అమరావతిః రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విని పరిష్కరించేందుకే ప్రజాప్రభుత్వం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా పరదాలు కట్టుకుని తిరగడం లేదని, కష్టాల్లో ఉన్న ప్రతిఒక్కరికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ 32వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రి లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు..

- కుంచనపల్లి, ప్రాతూరు ప్రాంత రైతులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంచనపల్లి, ప్రాతూరు లంక పొలాలు నీటమునిగి తీవ్రంగా నష్టపోయామని, పొలాల్లోని ఆయిల్ ఇంజన్లు సైతం నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించిన తగిన విధంగా సాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
- ఇటీవల సంభవించిన వరదలకు మంగళగిరి పట్టణం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి నగర్ లో తమ ఇళ్లల్లోకి నీరు చేరి, ఇంట్లోని వస్తువులు పాడైపోయాయని బాధితులు మంత్రి నారా లోకేష్ కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విధాల నష్టపోయిన తమకు ప్రస్తుతం కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని, తగిన ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
- వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారం నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని, డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన ఆర్.సాయికుమారి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు..

- పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఏ.ముప్పాళ్ల గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని రాపర్ల జగన్నాథం మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 10వేల జనాభా ఉన్న గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముప్పాళ్ల గ్రామంలో మహాత్మా గాంధీ మూడు రోజులు బసచేశారని, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో భాగంగా తమ గ్రామానికి మహాత్మా గాంధీ వచ్చినప్పుడు తులాభారం వేసినట్లు వివరించారు. అంతటి చారిత్రక నేపథ్యం ఉన్న తమ గ్రామానికి నాగార్జున సాగర్ కెనాల్ నుంచి పైప్ లైన్ ద్వారా తాగునీటి వసతి కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ కాంట్రాక్ట్ నర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిలి విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ ద్వారా రోస్టర్ పాయింట్ ఆధారంగా మెరిట్ లో ఎంపికై గత పదేళ్లుగా అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ, కోవిడ్-19 సేవలందించామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దాదాపు 15 ఏళ్లుగా శాశ్వత ప్రాతిపదికన ఒక్క ఉద్యోగానికి కూడా నోచుకోలేదన్నారు. రెగ్యులర్ పోస్టు కోసం ఎదురుచూస్తున్న తమకు న్యాయం చేయాలని, అర్హత కలిగిన స్టాఫ్ నర్సులకు రెగ్యులర్ పోస్టులు ఇవ్వాలని కోరారు. కలపరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
- టీడీపీ హయాంలో హోంగార్డు ఉద్యోగాలు పొంది వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న తమను అనంతరం వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో అప్పటి అధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారని చిత్తూరుకు చెందిన 87 మంది హోంగార్డులు మంత్రి నారా లోకేష్ కలిసి ఫిర్యాదు చేశారు. తిరిగి హోంగార్డు ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- అల్లూరి సీతారామరాజు జిల్లా, వీఆర్ పురం మండలం కె.కొత్తగూడం గ్రామ రైతులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు కింద సేకరించిన తమ భూములకు వచ్చిన నష్టపరిహారాన్ని ఫోర్జరీ సంతకాలతో అధికారులు స్వాహా చేశారని ఫిర్యాదు చేశారు. రీ సర్వే చేయడంతో పాటు నష్టపరిహారాన్ని రికవరీ చేసి వాస్తవ బాధిత రైతులకు భూపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
- గోదావరి డెల్టా సిస్టమ్ ధవళేశ్వరం సర్కిల్ పరిధిలో అవుట్ సోర్సింగ్ డైలీ వేజ్ లస్కర్లు పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 10 నెలల వర్క్ ఆర్డర్ ను 12 నెలలకు పెంచాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అదేవిదంగా 15 నెలల పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
- బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం రామాపురం గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామంలోని 230 మందిపై టీడీపీ సానుభూతిపరులనే నెపంతో అక్రమ కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదు చేశారు. మహిళలని కూడా చూడకుండా అప్పటి డీఎస్పీ, సీఐ, ఎస్ఐ చిత్రహింసలకు గురిచేశారని కన్నీటిపర్యంతమయ్యారు. తమపై నమోదుచేసిన అక్రమ కేసులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos