దెందులూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ పెదవేగి మండలం బాపిరాజు గూడెంకు చెందిన దాదాపు 248 మంది మహిళలు జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు బోప్పన సుధా ఆధ్వర్యంలో అరుణాచల యాత్రకు 6 బస్సుల్లో బయలుదేరారు..ఈ యాత్ర బాపిరాజు గూడెం లోని రామచంద్రపురం వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జండా ఊపి అమరావతి చట్టబద్ధతపై అరుణాచల యాత్ర" ప్రయాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు..
ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ.. అమరావతి రాజధానికి పార్లమెంటులో ఆమోదం లభించడం పట్ల దెందులూరు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన కూటమి నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వాటిలో భాగంగానే ఈరోజు పెదవేగి మండలం బాపిరాజు గూడెంకు చెందిన 248 మంది మహిళలు అరుణాచలం యాత్ర చేపట్టి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలపడానికి బయలుదేరుతున్నారని, వారి ప్రయాణానికి అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడమే కాకుండా యాత్రకు పదిమంది పర్యవేక్షకులను సైతం కేటాయించడం జరిగిందని అన్నారు.. అమరావతి రాజధాని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండగా అసెంబ్లీ లో అమరావతి రాజధాని ప్రకటిస్తున్నప్పుడు అసెంబ్లీలో ఎందుకు ఇలాంటి మావిగన్ ప్రపోజల్ చెప్పలేదని నిలదీశారు. అమరావతి రాజధానిపై వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని అటువంటి బుద్ధిలేని వ్యాఖ్యలను సభ్య సమాజం సమర్ధించదని వైసిపి నాయకులు ఇకనైనా గ్రహించాలని హితవు పలికారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజన్ 2047 లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు కొనసాగుతుందని, ఈ విధంగా చిత్తశుద్ధితో రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి అన్ని రంగాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు నిలబడాలని, రాష్ట్ర అభివృద్ధిపై అక్కసుతో అసత్య ప్రచారాలతో కుట్రలు చేస్తున్న వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పేలాగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు....
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos