విజయవాడలో ఇవాళ గురువారం జనవరి 8 నుంచి మూడు రోజుల పాటు ఆవకాయ్ - అమరావతి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఏపీ పర్యాటక శాఖ, "టీమ్ వర్క్ ఆర్ట్స్" అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ ఫెస్టివల్ కృష్ణానది తీరాన పున్నమి ఘాట్‌లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది.  తెలుగు సినిమా ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, కవితా పఠనాలు, సంగీతం, నృత్యం, నాటకాలు, వర్క్ షాప్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధునిక కళా ప్రదర్శనలు ఉంటాయని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి ఈ ఏర్పాట్లను పూర్తి చేశారు.

ఈ ఫెస్టివల్ లోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా హౌస్ బోట్లు, రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైన్ ను ప్రారంభిస్తారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో సినిమా, సాహిత్య రంగాలకు చెందిన దిగ్గజాలు, ప్రపంచవ్యాప్త కళాకారులు పాల్గొననున్నారు. ప్రధానంగా హెరిటేజ్ వాక్ తో పాటు ఘాట్ ఫెర్రీ ప్రయాణం, ఫుడ్ ఫెస్టివల్ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రముఖ గాయకులు జావేద్ అలీతో సంగీత కచేరి ఉండనుంది. వైవిధ్యభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు, సినిమా చర్చలు, సాహిత్య గోష్టులు సందర్శకులను అలరించనున్నాయని నిర్వాహకులు తెలిపారు. 

ఇవాళ గురువారం సాయంత్రం 4.45 గంటలకు భారీ తోలుబొమ్మలాట, డ్రమ్స్ ప్రదర్శనతో ప్రారంభోత్సవ  ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అనంతరం జమ్మెర్స్ టీం సంగీత ప్రదర్శన, పున్నమి ఘాట్ దగ్గర హారతి కార్యక్రమం ఉంటుంది. ఒమాజియో పెర్ఫార్మింగ్ కంపెనీ వారి హర్ ఫ్రేమ్స్, హర్ ఫైర్ కార్యక్రమం ఉండనుంది. అనంతరం 7.50 గంటలకు ముఖ్య అతిథులతో ఉత్సవం ప్రారంభం అవుతుంది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొననున్నారు. ఆ తర్వాత రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు ప్రేమ కథ సంగీత నాటకంతో తొలిరోజు కార్యక్రమం ముగస్తుందని నిర్వాహకులు తెలిపారు. జనవరి 9, 10 తేదీలు అంటే శుక్ర, శనివారాల్లో కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలిపారు.

" ఆవకాయ్ -అమరావతి"  ఫెస్టివల్ లో సందర్శకులకు ప్రవేశం ఉచితం. అయితే ప్రేక్షకులు ఆన్ లైన్ వేదికగా www.avakaifestival.com లో పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos