సంక్రాంతి పండుగ సమయంలో సూర్యడు దక్షిణయానం నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలి తట్టుకునేందుకు భోగి మంటలు వేయడంతో సంక్రాంతి పర్వదినాలు ప్రారంభమవుతాయి. ఈరోజునే భోగి పండుగగా జరుపుకుంటారు. ఆధ్యాత్మికపరంగా చూస్తే దక్షిణయానంలో పడిన కష్టనష్టాలను తొలగించి.. సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారని కూడా చెబుతారు

పాతను వదిలి.. నవ్యత్వాన్ని ఆహ్వానించడానికి సూచిక భోగి పండుగ. భోగి రోజు వేకువజామునే వేసే భోగి మంటలు పరివర్తన కు సంకేతం. ఇంట్లోని పాత వస్తువులను, పనికిరాని సామాగ్రిని మంటల్లో వేయడం వెనుక ఉన్న అసలు అంతరార్థం.. మనలోని పనికిరాని పాత ఆలోచనలను, అలవాట్లను, ద్వేషాలను , జడత్వాన్ని వదిలిపెట్టడం. అగ్ని ఏ విధంగా వస్తువులను దహించి బూడిద చేస్తుందో, అలాగే మనం కూడా మనసులోని నెగిటివ్ భావాలను తొలగించుకుని, కొత్త ఉత్సాహంతో, స్వచ్ఛమైన మనసుతో జీవితంలో ముందడుగు వేయాలని ఈ పండుగ మనకు బోధిస్తుంది.

భోగి పండుగ వెనుక శాస్త్రీయమైన, ఆరోగ్యకరమైన కోణం కూడా దాగి ఉంది. చలికాలం ముగిసి ఎండలు మొదలయ్యే సంధి కాలంలో వాతావరణంలోని సూక్ష్మక్రిములను నశింపజేయడానికి ఆవు పిడకలు, మామిడి, రావి వంటి ఔషధ కట్టెలతో మంటలు వేస్తారు. ఇది వాతావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా, మన శరీరంలోని నాడులను కూడా ఉత్తేజపరుస్తుంది. అలాగే చిన్నారులపై భోగి పళ్లు పోయడం వెనుక వారికి సూర్యభగవానుడి ఆశీస్సులు లభించాలని, దిష్టి తగలకుండా ఉండాలని పెద్దల నమ్మకం. ప్రకృతిని గౌరవిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారానే సుఖసంతోషాలు సాధ్యమవుతాయి.

భోగి అంటే భోగము లేదా అనుభవము అని అర్థం. అయితే నిజమైన భోగం అంటే కేవలం మనమే సుఖపడటం కాదు, మనకున్న దానిని అందరితో పంచుకోవడమే. సంపదలు దక్కినప్పుడు ఆ ఆనందాన్ని పదిమందితో కలిసి ఆస్వాదించాలనేది ఈ పండుగ పరమార్థం. గోదాదేవి శ్రీరంగనాథుడిని చేరుకుని పరమానందాన్ని పొందిన ఈ పవిత్ర రోజున, మనం కూడా తోటివారికి సహాయం చేస్తూ, అందరితో ఆప్యాయంగా ఉంటూ సమష్టి ఆనందాన్ని పొందాలని భోగి బోధిస్తోందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos