అమరావతి : అమరావతి సచివాలయంలో బిట్స్ పిలాని సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. రాజధాని ప్రాతంలో నిర్మిస్తున్న బిట్స్ పిలాని క్యాంపస్ పనుల పురోగతిపై ముఖ్యమంత్రికి వివరించారు. రాజధానిలో నిర్మిస్తున్న క్యాంపస్ లో క్వాంటం, ఏఐ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు బిట్స్ పిలాని ప్రతినిధులు తెలిపారు.  2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి తెలియచేశారు. రాజధాని ప్రాంతంలోని క్యాంపస్‌ సహా సంస్థ విస్తరణ కోసం రూ.250 కోట్ల మేర వ్యయం చేయనున్నట్టు వెల్లడించారు. మూడు దశల్లో బిట్స్ పిలాని అమరావతి క్యాంపస్ నిర్మిస్తున్నామని.. మొత్తం 10 వేల మంది విద్యార్ధులు విద్యను అభ్యసించేలా క్యాంపస్ నిర్మాణం జరుగుతుందని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం క్వాంటం టెక్నాలజీ రంగంలో స్టార్టప్ లను ప్రోత్సహించేలా ఈ క్యాంపస్ లో  ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos