ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ బుధవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లడం ఇది మూడోసారి. లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా.. 2027 జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే  విషయాల గురించి ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పనుల వేగిరంపై అధికారులకు, కాంట్రాక్టు సంస్థకు దిశానిర్దేశం చేయనున్నారు. బుధవారం ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11.10 గంటలకు ప్రాజెక్టు హిల్‌వ్యూ ప్రాంతానికి చేరుకుంటారు.

అక్కడ తొలుత ప్రజా ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాపర్‌ డ్యాంలు, బట్రస్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌, గ్యాప్‌ 1, 2, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, కుడి ప్రఽధాన కాలువ కనెక్టివిటీ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులు, మేఘా ఇంజనీరింగ్‌ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో తిరుగుపయనమవుతారు. సీఎం పర్యటనకు ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిశోర్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.  కాగా, కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో పోలవరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పనుల్లో 13 శాతం పురోగతి ఉంది. మొత్తంగా ఇప్పటివరకు 87.8 శాతం పనులు పూర్తయ్యాయి 

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే సరికి పవర్‌ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇప్పటికే 50 శాతం సివిల్‌ వర్క్‌ జరిగింది. గోదావరి ఒడ్డున అంగులూరులోని పెద్దకొండల తొలిచి 12 టర్బైన్స్‌ నిర్మించారు. ఈ టర్బైన్స్‌కు ఇప్పటికే లైనింగ్‌ వర్క్‌ చేశారు. మిగతా ఐరన్‌ వర్క్‌ జరుగుతోంది. మొ త్తం 12 యూనిట్ల కింద విభజించారు. దీని వెనుక పవర్‌ ప్రాజెక్టుకు అవసరమైన సామగ్రి కోసం రెండు పెద్ద స్టోరేజీలను నిర్మిస్తారు. 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక ఇప్పటి వరకు రూ.5052.71 కోట్ల అడ్వాన్సులను తెచ్చి పనులు వేగవంతం చేశారు. డయా ప్రమ్‌ వాల్‌కు 55,589 చదరపు మీటర్లు పని జరిగింది. లక్ష్యంలో 85 శాతం మేర పూర్తయింది. ఎడమ ప్రఽధాన కాల్వ అనుసంధాన పనుల్లో 94 శాతం మట్టి పనులు, ,75 శాతం లైనింగ్‌ పనులు, 77 శాతం ఆకృతుల పనులు పూర్తయ్యాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos