ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పరంగా కీలక మార్పులకు సిద్దం అయ్యారు. సుదీర్ఘ కసరత్తు తరువాత పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త అధ్యక్షుల ఖరారు పైన నిర్ణయానికి వచ్చారు. అదే విధంగా పార్టీలో సీనియార్టీ, విధేయతకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక జరిగింది. అదే విధంగా పార్టీ పదవుల్లోనూ కీలక మార్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ పదవులపై చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నారు. పార్టీలో కీలక నియామకాల కసరత్తు దాదాపు పూర్తయింది. సిద్ధం చేసిన జాబితా ప్రకారం పార్ల మెంటరీ పార్టీ అధ్యక్షుల్లో సీనియర్లతో పాటు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం కల్పించారు. సుమారు 10 మంది సీనియర్లకు అవకాశం దక్కింది. తిరుపతి జిల్లా: పనబాక లక్ష్మి, చిత్తూరు జిల్లా: షణ్ముగం, అన్నమయ్య జిల్లా: సుగవాసి ప్రసాద్, ప్రకాశం జిల్లా: ఉగ్ర నరసింహారెడ్డి, అనంతపురం జిల్లా: కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లా: ఎంఎస్ రాజు, నంద్యాల జిల్లా: ధర్మవరపు సుబ్బారెడ్డి, విజయనగరం జిల్లా: కిమిడి నాగార్జున, ఏలూరు జిల్లా: బడేటి చంటి, కాకినాడ జిల్లా: జోత్యుల నవీన్, బాపట్ల జిల్లా: సలగల రాజశేఖర్, పల్నాడు జిల్లా: కొమ్మాలపాటి శ్రీధర్, గుంటూరు జిల్లా: పిల్లి మాణిక్యాలరావు, ఎన్టీఆర్ జిల్లా: గద్దె అనురాధ, కృష్ణా జిల్లా: వీరంకి గురుమూర్తి, పశ్చిమ గోదావరి జిల్లాకు రామరాజు, తూర్పుగోదావరి జిల్లాకు వెంకటరమణచౌదరి నియమితులయ్యారు.
అదే విధంగా కోనసీమ జిల్లా: గుత్తుల సాయి, విశాఖ జిల్లా: చోడే పట్టాభిరామ్, అనకాపల్లి జిల్లా: బత్తుల తాతబ్బాయ్, కర్నూలు జిల్లా: వహీద్, నెల్లూరు జిల్లా: బీదా రవిచంద్ర, కడప జిల్లాకు భూపేశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ జాబితాలో పదిమంది ఓసీలు, 9మంది బీసీలు, నలుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక మైనార్టీకి అవకాశం లభించనుంది. ఓసీల్లో నలుగురు కమ్మ, ముగ్గురు కాపులు, ఇద్దరు రెడ్లు, ఒక రాజు ఉన్నారు. ఇదిలా ఉండక పిల్లి మాణిక్యాలరావు (లిడ్‌క్యాప్ చైర్మన్), వీరంకి గురుమూర్తి (గౌడ కార్పొరేషన్ చైర్మన్,), కోట్ని బాలాజీ (డీసీఎంస్ చైర్మన్), బొడ్డు వెంకట రమణ చౌదరి (రాజమండ్రి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్), మంతెన రామరాజు (ఏపీఐఐసీ చైర్మన్), సలగల రాజశేఖర్ (బాపట్ల అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్), మన్నే సుబ్బారెడ్డి (విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్) నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos