ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్దినీ పరుగులు తీయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ విన్నూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే అందరికీ అందుతున్నాయి. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో చేపట్టిన ఇలాంటి ఓ ప్రయత్నం సక్సెస్ కావడంతో పాటు గిన్నిస్ బుక్ రికార్డు కూడా అందుకుంది.

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నియోజకవర్గం కుప్పాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ-సైకిళ్ల తయారీని ప్రోత్సహించింది. ఇలా దాదాపు 5 వేలకు పైగా ఈ-సైకిల్స్ ను నియోజకవర్గానికి చెందిన ఇ-మోటరాడ్ సంస్థ తయారు చేసింది. వీటిని స్థానికంగా పంపిణీ చేశారు. ఇలా మొత్తం 5555 ఈ-సైకిల్స్ ను పంపిణీ చేయడం ద్వారా చిత్తూరు జిల్లా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. దేశంలోని ఏ జిల్లాలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఈ-సైకిల్స్ తయారు చేసి పంపిణీ చేయలేదు. 5555 ఈ -సైకిళ్ల పంపిణీ చేపట్టి గిన్నిస్ రికార్డు సాధించిన చిత్తూరు జిల్లా అధికారుల్ని సీఎం చంద్రబాబు ఇవాళ అభినందించారు. పెద్ద ఎత్తున ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టి గిన్నిస్ రికార్డును సాధించినట్టు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు. దీంతో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా చిత్తూరు జిల్లా కలెక్టర్ గిన్నిస్ రికార్డు పత్రాన్ని అందుకున్నారు. కుప్పాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5555 ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టారు. ఇప్పటికే కుప్పంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్ని పరుగులు తీయిస్తున్న చంద్రబాబు.. ఈ గిన్నిస్ రికార్డు ఘనతతో మరో మైలురాయి అధిగమించారు.

గతంలో ఒకేసారి పెద్దమొత్తంలో సైకిళ్లను డెలివరీ చేసిన రికార్డును తుడిచి పెట్టి కుప్పంలో చరిత్ర సృష్టించామని చంద్రబాబు ఈ సందర్బంగా తెలిపారు. ఈ-సైకిళ్ల వల్ల రాబోయే కాలంలో ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఈ-సైకిళ్లకు సూపర్ సైకిల్ అనే పేరు పెట్టామన్నారు. 60 కిలో మీటర్ల వరకు ఈజీగా సైకిల్ మీద వెళ్లి పని చేసుకోవచ్చన్నారు. సైకిల్ ఎక్కడికైనా దూసుకెళ్తుంది. అదే ఈ సూపర్ సైకిల్ ప్రత్యేకత అని చంద్రబాబు వెల్లడించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos