ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. బుధవారం హఠాత్తుగా ఢిల్లీకి సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు కావడం, అది కూడా కేవలం అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ కోసం సమయం కేటాయించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్  లో రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను నేరుగా పవర్ సెంటర్  వద్దే తేల్చుకోవాలనేది బాబు మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలను వారితో చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ప్రధాన అజెండా కేంద్ర బడ్జెట్ మరియు రాష్ట్రానికి రావలసిన నిధులు. త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పెద్దపీట వేయాలని, విభజన హామీల మేరకు రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరనున్నారు.

మరోవైపు తమిళనాడులో సినీ నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం, అమిత్ షా అక్కడ పావులు కదుపుతుండటం వంటి పరిణామాలు దక్షిణాది రాజకీయాల్లో వేడిని పెంచాయి. ఈ  కారణంగా  పొరుగు రాష్ట్రాల రాజకీయాలు,  ఎన్డీఏ (NDA) కూటమిలో ఏపీ ప్రాముఖ్యతపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. హడావుడిగా వెళ్లడం వెనుక కేవలం నిధులు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కేంద్రానికి ఒక స్పష్టమైన  రిపోర్ట్ ఇవ్వడం కూడా బాబు వ్యూహంలో భాగమేనని అంచనా వేస్తున్నారు.  

షెడ్యూల్ ప్రకారం... బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం చంద్రబాబు రాజమండ్రి విమానాశ్రయం నుంచి  ఢిల్లీకి బయలుదేరతారు. రాత్రి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ ఉంటుంది. అనంతరం రాత్రి 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో తిరుగుపయనమై, అర్ధరాత్రి 1:30 గంటలకు విజయవాడ సమీపంలోని ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనకు రాజకీయంగా, పరిపాలనాపరంగా ప్రాధాన్యత ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos