అమరావతి: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్-జీపీసీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 1 తేదీన శంకుస్థాపన చేయనున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని మదనపాలెంలో హీరో మోటార్ కార్ప్స్ నూతనంగా ఏర్పాటు చేయనున్న జీపీసీకు సీఎం భూమిపూజ చేయనున్నారు.  హీరో మోటార్స్ కు చెందిన వివిధ తయారీ కేంద్రాలు, డీలర్లకు ద్విచక్ర వాహనాల విడి భాగాలను తయారు చేసి సరఫరా చేసేలా ఆ సంస్థ ఈ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.  రూ.750 కోట్ల పెట్టుబడితో హీరో మోటార్ కార్పోరేషన్ ఈ జీపీసీ 2.0ను నిర్మించనుంది. దీని ద్వారా 4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.  ఇప్పటికే శ్రీసిటీ సమీపంలో హీరో మోటార్స్ సంస్థ ఏర్పాటు చేసిన అధునాతన ద్విచక్ర వాహనాల తయారీ ప్లాంట్ లో ఏడాదికి  1.5 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి జరుగుతోంది. దేశ, విదేశాల్లో ఉన్న మోటార్ సైకిళ్లు, స్కూటెక్ లు, ఈవీలకు విడి భాగాలను తయారు చేసేందుకు గానూ ఈ జీపీసీను హీరో మోటార్స్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పీ4 కార్యక్రమంలో మార్గదర్శిగా ఉన్న హీరో మోటార్స్ సంస్థ పలువురికి స్కాలర్ షిప్ లను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ద్వారా హీరో మోటార్స్ అందించనున్న బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ పేరుతో హీరోస్ ఆఫ్ టుమారో పేరిట స్కాలర్‌షిప్ లను సీఎం ఆవిష్కరించనున్నారు.  ఏపీ పోలీసులు వినియోగించుకునేలా హీరో మోటార్స్ సంస్థ ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలను కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించనున్నారు. 

పేదల సేవలో సీఎం... 

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం, పున్నపువారిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. వృద్ధాప్య, వితంతు సహా వేర్వేరు కేటగిరీలకు చెందిన 62 లక్షల మంది లబ్దిదారులకు రూ.2750 కోట్ల మేర పెన్షన్ ను అందించనున్నారు. పున్నపువారిపాలెం గ్రామంలో ఓ లబ్దిదారు ఇంటికి వెళ్లనున్న ముఖ్యమంత్రి స్వయంగా పెన్షన్ ను పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం పాల్గొననున్నారు. రాత్రికి శ్రీసిటీలో ఉన్న అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos