ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఏపీలో కొత్త పరిశ్రమలు.. పెట్టుబడుల పైన వివరాలు వెల్లడించారు. పెట్టుబడులను గ్రౌండింగ్ చేసే బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పారు. ఈ నెల మార్చి 23 న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్స్ కు శంకుస్థాపన జరగనుందని చెప్పారు. అదేవిధంగా జూన్, జులై లో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. గూగుల్ కు త్వరలో శంకుస్థాపన చేస్తామని.. నెల్లూరు లో BPCL, కడప లో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించే విషయంపైనా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
కడప స్టీల్ ప్లాంట్ 2028 కి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ప్రకటించారు. కొప్పర్తి , ఓర్వకల్లు, కృష్ణ పట్నం ఇండస్ట్రియల్ కారిడార్, 175 MSME పార్కుల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్దేశించారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ బుధవారం తొలిరోజు కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని స్పష్టం చేసారు. సీనియర్ సెక్రటరీలు 4 రోజుల పాటు క్షేత్రస్థాయికి వెళ్లాలని నిర్దేశించారు. దీనిపై పోర్టల్ తయారు చేసి ఆన్ లైన్ లో పెట్టేలా సీఎస్ బాధ్యత తీసుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సింది కలెక్టర్లే... ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని సీఎం తేల్చి చెప్పారు. ఏది వాస్తవమో అధ్యయనం చేసుకుని తగిన నిర్ణయం తీసుకునే బాధ్యత కలెక్టర్లదే అని చంద్రబాబు స్పష్టం చేసారు. సంక్షేమం - డెవలప్‌మెంట్, గుడ్ గవర్నెన్స్ బ్యాలన్సింగ్ చాలా అవసరమని చెప్పారు. అదే విధంగా వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ ఈరోజు రియాలిటీగా మారుతోందని సీఎం అన్నారు. ఉద్యోగుల, అధికారుల ఉదాసీనత కూడా చేయాల్సిన పనులపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
గతంలో విజన్ 2020 పెట్టినప్పుడు చాలామంది విమర్శించారని.. ఇప్పుడు అది ఫలితాన్ని ఇవ్వడంతో 2047వైపు అందరూ చూస్తున్నారని సీఎం అన్నారు. ఈసారి 15 పాయింట్లను ఈ ఏడాది లక్ష్యాల కింద ఇస్తున్నట్లు చెప్పారు. 20 నెలల్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏ సంక్షేమ కార్యక్రమం ఎప్పుడు చేస్తామో ముందే చెబుతామని.. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. ఈ నెలలో 13వ 'అన్నదాత సుఖీభవ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు సీఎం. ఖరీఫ్‌కు ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేయాలని సీఎం సూచించారు. విద్యుత్ చార్జీలను 39 పైసలు తగ్గిస్తున్నామని.. తద్వారా వినియోగదారులపై భారం భారీగా తగ్గనుందని వెల్లడించారు. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్‌లు ఏర్పాటు చేయాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos