ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

2014-15 నుండి 2018-19 సంవత్సరాల మధ్య పూర్తి అయిన పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి పనుల బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 1982 లో వచ్చిన “ఏపీ లాండ్ గ్రాబింగ్ యాక్ట్” స్థానంలో 2024 లో కొత్త ముసాయిదా బిల్‌ను ప్రవేశపెట్టడానికి కేబినెట్ ఆమోదించింది. జ్యుడీషియల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసును 60 నుండి 61 సంవత్సరాలకు పెంచేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ ఈ ఏడాది నవంబర్ 1 నుండి అమలులోకి రానుంది. ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్ సవరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్ 2024 కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కుప్పం , పిఠాపురం ప్రాంతాలలో ఎరియా డెవలప్ మెంట్ అథారిటీలను ఏర్పాటుచేసేందుకు కేబినెట్ ఆమోదించింది. కుప్పం డెవలప్ మెంట్ అథారిటీ నాలుగు మండలాలను, ఒక మున్సిపాలిటీని కవర్ చేస్తూ స్థాపించబడింది. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పల్నాడు జిల్లా 92 గ్రామాలు, బాపట్ల జిల్లా 62 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి చేర్చేలా కేబినెట్ నిర్ణయించింది.

2024-25 విద్యా సంవత్సరంలో నుండి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌ను విద్యార్థుల కళాశాల బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీని ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయడం సాధ్యం అవుతుంది. ఈ ఏడాది జూన్ 24 నుండి అక్టోబర్ 23 వరకు తీసుకున్న మంత్రివర్గ నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులపై కూడా క్యాబినెట్ లో చర్చ జరిగింది. ఈ కీలక నిర్ణయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సామాజిక సంక్షేమం, విద్యా రంగం తదితర విషయాల్లో సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos