ఏపీ రాష్ట్రంలో గృహ వినియోగదారులకు రియల్ ఎస్టేట్  రెగ్యులేటరీ అథారిటీ గురించి  అవగాహన కల్పించడంలో భాగంగా మొట్టమొదట తిరుపతిలో సదస్సు నిర్వహించామని, అది పూర్తిగా సక్సెస్ అయిందని, వినియోగదారుల్లో మంచి రెస్పాన్స్ వచ్చిందని ఏపీ రెరా చైర్మన్ శివారెడ్డి అన్నారు. ఇవాళ సోమవారం జనవరి 12వ తేదీ అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులు ఎన్నో సమస్యలను తమ రెగ్యులేటర్ అథారిటీ దృష్టికి తీసుకువచ్చారని, వారి సమస్యల పైన తాము స్పందించి తగిన సలహాలు ఇచ్చామని, వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని అన్నారు. 

తాము ఈ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించి కొత్త కార్యవర్గ బాధ్యతలు తీసుకుని నాలుగు నెలలు అవుతోందని, ఈ మధ్యకాలంలో అనేక అభివృద్ధి కర ప్రణాళికలు ప్లాన్ చేశామని అన్నారు. మేము ప్లాన్ చేసుకున్న ప్రకారం ఇక పాత ఉమ్మడి జిల్లాలైన 13 జిల్లాల్లో సదస్సులు నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28, 29 తేదీల్లో కడపలో సదస్సు నిర్వహించి ఆ ప్రాంత వినియోగదారులకు డెవలపర్స్ కు రెగ్యులేటరీ అథారిటీ ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తామన్నారు. ప్లాట్లు, ఫ్లాట్ల డెవలపర్స్ ప్రమోటర్స్,  బిల్డర్స్ నుంచి ఏవైనా సమస్యలు, అసౌకర్యాలు ఎదుర్కొంటున్నట్లయితే వారు రెరా కు కంప్లైంట్ చేయవచ్చని శివారెడ్డి తెలిపారు. తద్వారా వినియోగదారుల, గృహ కొనుగోలుదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన వివరించారు. ఇలాంటి విషయాలన్నీ అవగాహన సదస్సులో వివరిస్తామని ఆయన అన్నారు. 

2016లో రెగ్యులేటరీ అథారిటీ రెరా యాక్ట్ అమలులోకి వచ్చిందని, గృహ కొనుగోలుదారుల హక్కులను పరిరక్షించడమే ఈ యాక్ట్ ప్రధాన ఉద్దేశం అని ఆయన వివరించారు. అదే సమయంలో నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రధాన లక్ష్యమని అన్నారు. 2019లో టీడీపీ ప్రభుత్వం మారడం, కరోనా వ్యాపించటం వంటి పరిణామాలు వల్ల చాలామంది నిర్మాణదారులు, డెవలపర్స్, కొనుగోలుదారులు రెరాలో వారి ప్రాజెక్టులను నమోదు చేసుకోలేదని, అయితే వారంతా ఇప్పుడు విధిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని తీర్మానం చేశామన్నారు. అలా ఇప్పటివరకు తమ ప్రాజెక్టులను నమోదు చేసుకోని వారు ఈ ఏడాది 2026 జనవరి 1 నుంచి 90 రోజుల్లోగా, 50 శాతం పెనాల్టీతో.. రిజిస్టర్ చేసుకునేలా అవకాశం కల్పించాలని నిర్ణయించామని ఆయన వివరించారు.

అథారిటీలో తమ ప్రాజెక్టులను నమోదు చేసుకోని వారు కనీసం ప్రకటనలు ఇవ్వడం కానీ, సేల్ చేయడం గానీ అగ్రిమెంట్ చేసుకోవడం గాని చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపైన ప్రాజెక్ట్ కాస్ట్ లో 10% పెనాల్టీ విధిస్తామని శివారెడ్డి హెచ్చరించారు. అదేవిధంగా ఇప్పటికే తమ వద్ద ప్రాజెక్టులు రిజిస్టర్  చేసుకున్న ప్రమోటర్లు క్వార్టర్లీ అప్ డేట్స్ ఇవ్వాలని, ఇప్పటివరకు ప్లాట్లు గాని ఫ్లాట్స్ గాని ఎంతమందికి డ్రైన్ చేయగలిగారనే వివరాలు ఇవ్వాలని, వారి నుంచి ఎంత డబ్బు కలెక్ట్ చేయగలిగారో, ఎంత సొమ్మును అథారిటీకి జమ చేశారో, ఆ సొమ్మును ఆ సంబంధిత ప్రాజెక్టులకే వినియోగిస్తున్నారు లేదా అనే విషయాలను పేర్కొనాలని తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos