ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుత జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఇవాళ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, పాలనాపరమైన సౌలభ్యం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నారు. జిల్లాల పునర్విభజనపై ఇప్పటికే ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఒకసారి సమావేశమై పలు ప్రతిపాదనలను పరిశీలించింది. ముఖ్యంగా మార్కాపురం, మదనపల్లిలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై భౌగోళిక, పరిపాలనాంశాలను కూలంకషంగా అధ్యయనం చేసింది. గతంలో ఒకసారి ఉపసంఘం సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమై తమ ప్రాథమిక నివేదికను, అభిప్రాయాలను అందజేశారు. ఈ నేపథ్యంలో నేడు మరోసారి సీఎం చంద్రబాబుతో ఉపసంఘం భేటీ కాబోతోంది. ఈ సమావేశంలో ప్రజా డిమాండ్లు, పరిపాలన సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక చర్చలు జరపనున్నారు. ఈ భేటీ అనంతరం ఈ నెల 28వ తేదీన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos