సీఎం చంద్రబాబుపై వైసీపీ హయాంలో అన్నీ తప్పుడు కేసులు పెట్టినట్లుగా తేలిపోతోంది. ప్రతి కేసు తప్పుడు కేసు. కనీస ఆధారాల్లేవు. చివరికి ఈడీ కూడా స్కిల్ కేసును తేల్చేసింది. మరి ఆ పేరుతో చంద్రబాబును అర్థరాత్రి అరెస్టు చేసిన వారిని ఏం చేయాలి.. రాజకీయ కుట్రలకు పాల్పడిన వారిని ఏం చేయాలి... వారిని ఇలా వదిలేస్తే రేపు మరొకరిపై ఇలాంటి బరితెగింపునకు పాల్పడరా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మోపిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లీన్ చిట్ ఇవ్వడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని అర్ధరాత్రి అరెస్టు చేసి, రోజుల తరబడి జైల్లో ఉంచడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం కేవలం రాజకీయంగా దెబ్బతీయడమేనని ఆ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో అధికారం అండతో చట్టాన్ని అస్త్రంగా మలచుకుని ప్రత్యర్థులను వేధించడం, వ్యవస్థలను దుర్వినియోగం చేయడం తీవ్రమైన పరిణామంగా పరిగణించాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కేసులో సీఐడీ చేసిన వాదనలు న్యాయస్థానంలో నిలబడకపోవడం, చివరకు ఈడీ కూడా ఆయన ప్రమేయం లేదని స్పష్టం చేయడం గమనిస్తే.. ఈ కేసు రూపకల్పనలో రాజకీయ ప్రమేయం ఎంత ఉందో అర్థమవుతోంది. కేవలం పైస్థాయి ఆదేశాలతో తప్పుడు ఆధారాలు సృష్టించిన, చట్టాలను వక్రీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాన్ని అపహాస్యం చేసే వారిని బోనులో నిలబెట్టినప్పుడే న్యాయవ్యవస్థపై సామాన్యుడికి నమ్మకం కలుగుతుంది. చంద్రబాబు కేసులో అక్రమ అరెస్టులకు పాల్పడిన వారు, కుట్రకు సహకరించిన వారు శిక్షార్హులని తేలితేనే.. భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి బరితెగింపునకు పాల్పడకుండా ఉంటారని వారు అంటున్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారికి, ఆ తప్పుడు రిపోర్టులు తయారు చేసిన అధికారులకు జరిమానాతో పాటు జైలు శిక్ష పడేలా చట్టాలను మరింత కఠినతరం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos