ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైల్వేశాఖ నుంచి కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయించుకుంటున్న చంద్రబాబుకు ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. అదీ తన సొంత నియోజకవర్గం కుప్పంలో తాను చేసిన ఓ ప్రతిపాదనకు రైల్వే మంత్రి ఆమోదం తెలుపుతూ తాజాగా లేఖ రాశారు. దీంతో కుప్పం వాసులకు ఇక ప్రయాణాల కష్టాలు తీరినట్లేనని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ లో రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో వాస్కోడగామా - వేలంకణి మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలుతో పాటు దాదర్ సెంట్రల్-పాండిచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలుకు కూడా స్టాప్ లు ఇచ్చారు. ఈ రెండు రైళ్లకూ కుప్పం రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసేందుకు ఆమోదం తెలుపుతూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సీఎం చంద్రబాబుకు స్వయంగా లేఖ రాశారు.

ఈ నెల 10 తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను సీఎం చంద్రబాబు కలిశారు. కుప్పం రైల్వే స్టేషన్ లో ఈ రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్టాపులు ఇవ్వాలని చంద్రబాబు ఆయన్ను కోరారు. దీనిపై రైల్వే అధికారులతో మాట్లాడిన మంత్రి అశ్వినీ వైష్ణవ్.. సాధ్యాసాధ్యాలు పరిశీలించి చివరికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు కుప్పం వాసులు ఇకపై ఈ రెండు రైళ్లలోనూ ప్రయాణాలు చేసేందుకు వీలు కలిగింది. అలాగే తన నియోజకవర్గం కుప్పానికి కేంద్రం నుంచి చంద్రబాబు ఓ వరం సాధించుకున్నట్లయింది. దీనిపై కుప్పం వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos