ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే సంక్రాంతి కానుకగా అన్న క్యాంటీన్లు గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. అన్న క్యాంటీన్లకు మంచి స్పందన వస్తోంది. అల్పాహారమైనా, భోజనమైనా ఇక్కడ రూ.5కే అందిస్తున్నారు. అన్న క్యాంటీన్లలో ఉదయం అల్పాహారమైనా, మధ్యాహ్నం, రాత్రికి భోజనమైనా రూ.5కే ఇస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి ప్రారంభించిన అన్న క్యాంటీన్లు, కొద్ది రోజుల్లోనే వారందరి ఆదరణను పొందాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నియోజక వర్గ, మండల కేంద్రాల్లో దాదాపు 70 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, వివిధ దశల్లో ఉన్న వీటి నిర్మాణాలు జనవరి 10లోగా పూర్తి చేయనున్నారు. జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణ ప్రాంతాల్లో సుమారు 205 అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. 2 లక్షల మందికిపైగా ప్రజలు ప్రతి రోజు భోజనం చేస్తున్నారు. ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. పూటకు రూ.5కే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 70 క్యాంటీన్లను మంజూరు చేసింది. పట్టణాలు, నగరాల్లో ప్రారంభించిన 205 క్యాంటీన్లలో ఇప్పటివరకు 7.20 కోట్ల మందికిపైగా పేదలకు ఆహారం అందించారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అన్న క్యాంటీన్లకు అత్యధిక స్పందన లభిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos