రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. మూడేళ్లలోగా అమరావతిలో తొలి దశ నిర్మాణాలను పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. ఇక అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో.. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, అమరావతి క్రికెట్ స్టేడియం వంటి నిర్మాణాలను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రాజధాని అమరావతి కోసం తొలి దశలో 33 వేల ఎకరాలు సమీకరించగా.. రాజధాని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రెండో విడతలో మరో 34 వేల ఎకరాలు సమీకరించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే రెండో విడత భూసమీకరణకు రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. అమరావతి రెండో దశ భూసమీకరణ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో అమరావతి రెండో దశ భూసమీకరణపై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ క్లారిటీ ఇచ్చారు. అమరావతి కోసం రెండవ విడత భూసమీకరణ ఎక్కడా ఆగలేదని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. రెండో దశ భూసమీకరణ కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రుల కమిటీని ఏర్పాటుచేశారని.. ఈ మంత్రుల కమిటీ ఈ విషయంపై చర్చిస్తుందని వెల్లడించారు. 2014-19 మధ్య చేపట్టిన భూసేకరణలో కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలని మంత్రుల కమిటీని చంద్రబాబు ఆదేశించినట్లు నారాయణ వివరించారు. వచ్చే రెండు, మూడురోజుల్లో మంత్రుల కమిటీ చర్చంచి వచ్చే ఏపీ కేబినెట్ భేటీ నాటికి నివేదిక అందిస్తుందని వివరించారు.

మరోవైపు అమరావతిలో మూడు చోట్ల పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అలాగే 5 వేల ఎకరాల్లో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం, 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, మరో 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ నెలకొల్పాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచన. ఈ నేపథ్యంలోనే రాజధాని కోసం రెండో విడతలో 13 గ్రామాల పరిధిలో భూమిని సమీకరించాలని ప్రతిపాదించారు. 34,964 ఎకరాల భూసమీకరణకు సీఆర్‌డీఏ సమావేశంలో ఆమోదం కూడా లభించింది. 26 వేల ఎకరాల పట్టాభూమి, 5200 ఎకరాల ప్రభుత్వభూమి.. మిగతావి ఎసైన్డ్, ఇతర కేటగిరీల భూములు ఉన్నాయని అధికారులు గుర్తించారు. భూసమీకరణ కోసం పలుచోట్ల గ్రామసభలు కూడా నిర్వహించారు. రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో అమరావతి రెండో దశ భూసమీకరణపై చర్చ జరిగినట్లు తెలిసింది. తొలి విడత భూసమీకరణలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి.. ఆ తర్వాత రెండో దశ భూ సమీకరణకు చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos