అమరావతి కీలక ఘట్టాలకు కేంద్రంగా మారుతోంది. రాజధాని నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రెండో విడత భూ సమీకరణ ప్రారంభించిన ప్రభుత్వం... ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తోంది. రైతుల సమస్యల పైన ఏర్పాటైన త్రిసభ్య కమిటీ వారి ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులకు దిశా నిర్దేశం చేస్తోంది. కాగా.. అమరావతి లో హైకోర్టు భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇందులో ఒకేసారి 4 రాఫ్ట్ లలో కాంక్రీట్ పనులు ప్రారంభం అయ్యాయి. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైకోర్టు నిర్మాణ ప్రాంగణంలో ఒకేసారి 4 రాఫ్ట్‌లలో కాంక్రీట్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ  ప్రారంభించారు. ఏకధాటిగా 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ స్లాబ్ (రాఫ్ట్) పనులను ప్రారంభించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. మొత్తం నిర్మాణంలో 65,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగిస్తుండగా, ఇప్పటికే 15,000 క్యూబిక్ మీటర్లు పూర్తయిందని వివరించారు. నేటితో మరో 15,000 క్యూబిక్ మీటర్ల పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ హైకోర్టు భవనాన్ని B+G+8 (బేస్‌మెంట్ + గ్రౌండ్ + 8 అంతస్తులు) విధానంలో, 50.4 మీటర్ల ఎత్తుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామి వివరించారు. ​ మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనంలో 52 కోర్టు హాళ్లు అందుబాటులోకి రానున్నాయి.

నిర్మాణంలో అత్యంత కీలకమైన 'రాఫ్ట్ ఫౌండేషన్' పనులు పూర్తయితే, మిగిలిన భవన నిర్మాణం చాలా వేగంగా కొలిక్కి వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.​ రాజధానిలో కేవలం కార్యాలయాలే కాకుండా, పాలన సాగించే యంత్రాంగం కోసం నివాసాల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుందని మంత్రి వివరించారు. అమరావతిలో అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4,026 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ​వీటిలో 3,500 ఇళ్లను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ​ముఖ్యంగా IAS అధికారుల నివాస భవనాలు ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చాయని ఆయన పేర్కొన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, నాణ్యతతో కూడిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos