ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్ణీత లక్ష్యాలను అధిగమిస్తూ సీఆర్డీఏ యంత్రాంగం రికార్డు స్థాయిలో పనులను పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించి కేవలం 48 గంటల వ్యవధిలోనే 3,026 క్యూబిక్ మీటర్ల భారీ కాంక్రీట్ నింపే ప్రక్రియను విజయవంతంగా ముగించింది. ఈ నెల 10వ తేదీ రాత్రి ప్రారంభమైన ఈ భారీ కాంక్రీట్ పనులు, సోమవారం రాత్రి అంటే 12 వ తేదీ రాత్రి పూర్తయ్యాయి. వందలాది మంది కార్మికులు షిఫ్టుల వారీగా, ఎక్కడా విరామం లేకుండా పని చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నారు. సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, అధికారులకు, కార్మికులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందించారు. గతంలో నిలిచిపోయిన ఈ పనులను ఐఐటీ నిపుణుల ధ్రువీకరణ పొందిన తర్వాతే సీఆర్డీఏ గత ఏడాది తిరిగి ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో పనులు ఆగిపోవడంతో పునాదుల్లో చేరిన నీటిని పూర్తిగా తొలగించి, పటిష్ఠమైన చర్యలు తీసుకున్న తర్వాతే పనులను వేగవంతం చేశారు. నేలపాడు సమీపంలో ఈ శాశ్వత హైకోర్టు భవనాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. సుమారు 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బేస్‌మెంట్‌తో పాటు గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తుల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ భవనంలో మొత్తం 52 కోర్టు హాళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 2027 మార్చి నాటికి భవనాన్ని సిద్ధం చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos