రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో జాప్యాన్ని ఇక ఎంతమాత్రం సహించే ప్రసక్తే లేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సోమవారం నేలపాడు పరిధిలో నిర్మిస్తున్న గెజిటెడ్ అధికారులు, గ్రూప్-డి క్వార్టర్ల నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల వేగంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, లక్ష్యాలను చేరుకోలేని నిర్మాణ సంస్థలపై నిప్పులు చెరిగారు. "పనిచేయలేకపోతే తప్పుకోండి.. అంతేకానీ కాలయాపన వద్దు" అంటూ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులకు ముఖం మీదే తేల్చి చెప్పారు.

క్షేత్రస్థాయిలో పనులు మందకొడిగా సాగడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన రాజధాని పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ షాపూర్ జీ పల్లోంజీ కన్‌స్ట్రక్షన్ సంస్థపై అసహనం వ్యక్తం చేశారు. లక్ష్యానికి అనుగుణంగా పనితీరు లేని సదరు సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను తక్షణమే పంపించేయాలని అధికారులను ఆదేశించడం సంచలనం సృష్టించింది. "ప్రభుత్వం గట్టిగా అడిగే రోజులు వచ్చాయి, నిర్దేశించిన గడువులోగా ఇటుక పడాల్సిందే" అని హెచ్చరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ, గత ప్రభుత్వంపై నిశిత విమర్శలు చేశారు. రాజధానిపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, ప్రజలు వారి నిరాధార మాటలను నమ్మే స్థితిలో లేరని అన్నారు. "గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడకుండా ఉండి ఉంటే, నేడు అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా వెలుగొందేది" అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన పనులను మళ్ళీ గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు.

ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ మంత్రి కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం 4,026 గృహాల నిర్మాణం వివిధ దశల్లో ఉందని, వాటిని త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే 3 నెలల్లో ప్రధాన రహదారుల పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. వర్షాకాలం రాకముందే డ్రైనేజీ, భూగర్భ కేబుల్ పనులను పూర్తి చేసి, వర్షం పడినా నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్తున్నామన్నారు. రానున్న మూడేళ్లలో పూర్తిస్థాయి పరిపాలన భవనాలను అందుబాటులోకి తెచ్చి, పాలనను ఇక్కడి నుంచే పరుగులు తీయిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos