ఏపీలో తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ తాజాగా రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో జంతువుల కొవ్వు కలిసినట్లు ఎక్కడా లేకపోవడం, అదే సమయంలో రసాయనాలతో కల్తీ జరిగినట్లు నిర్ధారణకు రావడంతో రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో కల్తీ నెయ్యిపై ప్రజల్ని తప్పుదోవ పట్టించారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర.. జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే దీనిపై చర్చించేందుకు 11వ తేదీన జరిగే అసెంబ్లీకి 11మంది సభ్యులతో రావాలని సూచించారు.
కల్తీ జగన్మోహన్ రెడ్డి శ్రీవారి ప్రసాదాన్నీ కల్తీ చేసే అపవిత్ర కార్యానికి గత 5ఏళ్లలో తెరలేపారని ఆరోపించారు. జగనే ఒక కల్తీ, కల్తీ నాయకులతో గత 5ఏళ్లు కల్తీ ప్రభుత్వాన్ని నడిపిన భాగోతం అంతా నివేదికల రూపంలో బయటకు వస్తోందన్నారు. దేవుడిపై నమ్మకం లేకే దోపిడీ కోసం నిబంధనలు సడలించారన్నారు. 4లక్షల ఆవుపాలు కావాలనే నిబంధన ఎందుకు ఎత్తేశారని ప్రశ్నించారు. పాలే లేని నెయ్యి కోసం అనుకూలంగా నిబంధనలు సడలించింది దోపిడీ కోసమేనని అన్నారు. పాలే లేని డైయిరీలకు పెద్ద మొత్తంలో ఆర్డర్ లు ఇచ్చి హవాలా రూపంలో ముడుపులు అందుకున్నారన్నారు. జంతుకొవ్వు అవశేషాలు కూడా రసాయనాలతో నెయ్యి పేరిట తయారు చేసిన కల్తీ పదార్ధంలో వెలుగు చూశాయన్నారు. దేవుడితో ఆటలాడిన జగన్ అందుకు తగ్గ ఫలితం అనుభవించి తీరుతాడన్నారు.
లడ్డూకు వాడిన నకిలీ పదార్ధాల్లో మోనో గ్లిజరైట్, మీటా క్యారటిన్, ఏసిడిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ రసాయనాలు వెలుగు చూశాయని మంత్రి తెలిపారు. మోనో గ్లిజరైట్ లో జంతు కొవ్వు లేదా వెజిటేబుల్ కొవ్వు ఉండవచ్చన్నది నిపుణుల అంచనా అని అన్నారు. తనకు దైవం మీద నమ్మకం లేదు కాబట్టి తిరుమలపై అపవిత్ర కుట్రలకు జగన్ తెరలేపాడన్నారు. కల్తీ జరిగింది వాస్తవమే కానీ భారీ కల్తీ జరగలేదన్నట్లుగా జగన్ చేస్తున్న వితoడవాదం దైవంపై అతనికి నమ్మకం లేదనటానికి నిదర్శనమని అన్నారు. పూర్తి నివేదిక వచ్చాక మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos