ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడే ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల ప్రధాన నియోజకవర్గాల పైన గురి పెట్టారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయిన జగన్.. ఇప్పుడు కూటమికి బలం ఉన్న నియోజక వర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గెలిచిన పిఠాపురంలో జగన్ కొత్త లెక్కలతో ముందుకు వెళుతూ... కీలక మార్పులకు సిద్దం అవుతున్నారు.

2019లో వైసీపీ గెలిచిన ఈ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు. ఈ నియోజక వర్గం నుంచి మాజీ ఎంపీ వంగా గీతను జగన్ బరిలోకి దింపారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున అక్కడే సభ ఏర్పాటు చేసి.. గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. అయినా.. ఆ ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు. టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న వర్మ సైతం పవన్ కు మద్దతుగా నిలిచారు. అయితే, ఇప్పుడు అక్కడ లెక్కలు మారుతున్నాయి. పవన్ తో సఖ్యతగా ఉంటున్న వర్మకు జనసేన నియోజకవర్గ నేతలతో గ్యాప్ వచ్చింది. వర్మకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇప్పటి వరకు దక్క లేదు. దీంతో వర్మ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

ఇదిలావుండగా.. తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు జగన్ తో భేటీ అయ్యారు. ప్రత్యేకంగా పిఠాపురంలో పరిస్థితుల పైన జగన్ ఆరా తీసారు. వంగా గీత ప్రస్తుతం ఇన్ ఛార్జ్ గా కొనసాగుతున్నా... పూర్తి స్థాయిలో ఫోకస్ చేయటం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అయింది. అయితే, గీత కంటే బలమైన నేత వైసీపీకి నియోజక వర్గంలో లేరని జిల్లా నేతలు స్పష్టం చేసారు. కాగా.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సహా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులను పిఠాపురంలో గీతకు మద్దతు గా నిలవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే.. అక్కడి నుంచే 2029 ఎన్నికలకు సమాయత్తంగా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో ఇప్పటి నుంచే కార్యాచరణ అమలు చేయాలని నిర్దేశించారు.

ఇక, నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితుల పైన తెప్పించుకున్న సర్వే నివేదికల ఆధారంగా జగన్.. కీలక దిశా నిర్దేశం చేసారు. త్వరలోనే తూర్పు గోదావరి కేంద్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనకు జగన్ సిద్దం అవుతున్నారు. దీంతో..అటు పార్టీలో నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న వారిలోనూ పవన్ మార్పులు చేయడంతో వర్మ పాత్ర కీలకంగా మారుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో పిఠాపురం కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos