ఏపీ రాజధాని అమరావతి రైతులకు గుడ్ న్యూస్. రాజధాని అమరావతి రైతులకు సీఆర్డీఏ ఆహ్వాన పత్రికలు పంపిస్తోంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులు రైతుల్ని వినూత్నంగా ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వం తరఫున 2025 నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతి నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులు త్వరగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని ఆహ్వాన పత్రికలో కోరారు.

రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేయడానికి సహాయ, సహకారాలు అందించాలని కోరుతూ...  సీఆర్డీఏ సిబ్బంది ఆహ్వానపత్రికల్ని  రైతులకు అందజేశారు. ఈ నెల 12న అమరావతి రైతుల ప్రత్యామ్నాయ రిటర్నబుల్‌ ప్లాట్లకు లాటరీ తీశారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లోని ఏపీ సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో.. భూ సమీకరణ కింద అమరావతికి భూములు ఇచ్చిన వారికి సీఆర్డీఏ ప్రత్యామ్నాయ రిటర్నబుల్‌ ప్లాట్లకు లాటరీ ప్రక్రియ నిర్వహించేవారు. రాజధాని పరిధిలో ఉన్న 14 గ్రామాల్లో రైతులకు నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రిటర్నబుల్‌ ప్లాట్లు పొందిన రైతుల కోసం.. 9 రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిందని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.

ఇలా లాటరీలో ప్లాట్లు పొంది ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు అందుకున్న రైతులు వారం రోజులలోగా సంబంధిత రిజిస్ట్రేషన్‌ కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు సీఆర్డీఏ అధికారులు. ఈ లాటరీలో ప్లాట్లు పొందిన రైతులకు.. వారి ప్లాట్లు ఎక్కడ కేటాయించారో వివరించేందుకు ప్రత్యేకంగా గ్రామ సర్వేయర్లను నియమించారు. అమరావతి పరిధిలోని మొత్తం 13 గ్రామాలకు చెందిన 261 మంది రైతులకు రెసిడెన్షియల్‌– 130, కమర్షియల్‌– 113 ప్లాట్లు అందజేశారు సీఆర్డీఏ అధికారులు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos