అమరావతి : వెటర్నరీ కాలనీలోని వీఎంసీ పార్క్ లో నూతనంగా నిర్మించిన జిమ్ ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. వెటర్నరీ కాలనీ వాసులు జిమ్ కోసం సొంతంగా డబ్బు సమకూర్చారన్నారు. వీఎంసీ ఆధ్వర్యంలో ఈ పార్కు నిర్వహణ జరుగుతుందన్నారు. గ్రీన్ డెవలప్మెంట్, పర్యావరణంపై సీఎం చంద్రబాబుతో చర్చించానని తెలిపారు. కాలనీల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు తనకు చెప్పారని..‌వాటిని పరిష్కారిస్తామన్నారు.

గత ఐదేళ్లల్లో అసలు ఏం చేశారో తెలుసుకున్నామని పేర్కొన్నారు. మనకు నిధులు కొరత చాలా ఉందని.. రూ.27 వేల‌ కోట్లు కేంద్రం నిధులు రాష్ట్రానికి రావాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రూ.17 వేలు కోట్లు కేంద్రం, 17 వేల కోట్లు రాష్ట్రం ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నిధులు నిలిపేశారన్నారు. స్వచ్చ భారత్ తరపున నిధులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర వాటా నిధులు ఇవ్వక పోవడం వల్ల ఆ నిధులూ ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ‌ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సీజేఎంఎస్‌లో రూ.19 కోట్లు కాగితాల్లో ఉన్నాయని.. డబ్బు మాత్రం లేదని మంత్రి నారాయణ తెలిపారు. ఆ నిధులు మొత్తం ఇతర అవసరాలకు మళ్లించేశారన్నారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు తమకు ఎదురవుతున్నాయన్నారు. సీఎం సహకారంతో కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos