అమరావతి :అత్యున్నత లోక్ సభలో రాజధాని అమరావతి గెజిట్ నోటిఫికేషన్ కు మద్దతు తెలపకుండా వాకౌట్ చేసి పారిపోయిన వైసీపీ పార్టీ తిరిగి మళ్ళీ 2029లో రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య హెచ్చరించారు.   వైసిపి వైఖరికి నిరసనగా విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టెది మరోదారి అన్నట్లు రాజధానిపై తనకున్న శకుని పగను జగన్ బయటపెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. అమరావతి బిల్లుకు మద్దతు తెలపని జగన్మోహన్ రెడ్డికి అమరావతిలో ఉండే అర్హత లేదని పేర్కొన్నారు. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసినా, తీరు మారలేదు అన్నారు. అమరావతి విధ్వంసం కారణంగానే రాష్ట్రం ముఫై ఏళ్ళు వెనక్కి పోయిందని చెప్పారు. రాజధానిపై పూటకో మాట మాట్లాడే పార్టీ ని రాష్ట్ర ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos