జమిలి ఎన్నికల పై కేంద్రంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా జరిగిన ఎన్డీఏ సమావేశం తరువాత కేంద్రంలోని ముఖ్య నేతలు జమిలి పైన బలమైన సంకేతాలు ఇస్తున్నారు. జమిలికి సిద్దం కావాలంటూ ఎన్డీఏ పక్షాలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీలోనూ ఈ చర్చ మొదలైంది. సీఎం చంద్రబాబు ఈ చర్చ వేళ పాలనా పరంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి కేంద్రంగా పావులు కదుపుతున్నారు.

ఈ క్రమంలో ఏపీ రాజధాని అమరావతిలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి పనులు ప్రారంభం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. ఇప్పుడు ఆ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మధ్యలో నిలిచిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు తాజాగా సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. దీని కోసం వచ్చే నెలలో టెండర్లను పిలవాలని నిర్ణయించారు. ఇక.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రుణం మంజూరుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది.

అమరావతిలో నిర్మాణాల కోసం టెండర్ల ఖరారుకు ముందే కన్సెల్టెంట్ల నియామకం పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో అమరావతిలో నేడు చంద్రబాబు పనులను తిరిగి ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టనున్నారు. ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని పనులను మొదలు పెట్టాలని నిర్ణయించారు. 160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్డీఏ ప్రారంభించింది. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో అమరావతిలో పనుల షెడ్యూల్ పైన ఒక అంచనా కు వచ్చారు. రూ 49 వేల కోట్లతో తొలి దశ పనులు పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.

ఇక, ప్రపంచ బ్యాంకు రుణం ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోనే అమరావతి కోసం అందనుంది. ఈ నిధులను పూర్తిగా మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే విధంగా రాజధానికి స్థలాలు ఇచ్చిన రైతులకు ఈ నెలలోనే ప్లాట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. జమిలి ఎన్నికల దిశ గా కేంద్రంలో అడుగులు పడుతున్న వేళ చంద్రబాబు అలర్ట్ అయ్యారు. సంక్షేమ పథకాల అమలు పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఇటు రాజధాని అమరావతిలోనూ వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇందు కోసం నేటి అమరావతి పర్యటనలో చంద్రబాబు ప్రకటించే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos