విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనతో ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు, ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనలో పలువురు కార్మికులు గాయపడినట్లు సమాచారం. ప్రమాద తీవ్రత కారణంగా మృతుల సంఖ్యపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే దీనిపై అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై స్టీల్‌ప్లాంట్ అధికారులు, సంబంధిత విభాగాలు విచారణ చేపట్టాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos