ఏపీ రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద నిన్న 23వ తేదీ సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు చెందిన ప్లాస్టిక్ పైపుల వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. దీంతో స్థానికులు, కంపెనీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.  పైపులు అధికంగా ఉండటం, దట్టమైన పొగ కారణంగా మంటలను అదుపు చేయడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు కానీ భారీ ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా అమరావతిలో వరుసగా జరుగుతున్న ఈ అగ్నిప్రమాదాలు ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. సాధారణంగా అగ్నిప్రమాదం జరగడానికి ఆస్కారం లేని ఖాళీ ప్రదేశాల్లో, నిల్వ ఉంచిన పైపులే లక్ష్యంగా మంటలు అంటుకోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో వెలగపూడి సమీపంలో కూడా ఇదే తరహాలో పైపులకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన మరువక ముందే, ఇప్పుడు రాయపూడిలో పునరావృతం అయింది. రాజధాని పనులను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే అసాంఘిక శక్తులు ఈ దారుణానికి ఒడిగడుతున్నాయని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

గతంలో జరిగిన ప్రమాదాలపై ముఖ్యమంత్రి స్వయంగా విచారణకు ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిఘా యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో అమరావతి ప్రాంతంలో చెరుకు తోటలకు నిప్పు పెట్టిన చేదు అనుభవాలు ఉన్నా, కీలకమైన నిర్మాణ సామాగ్రి వద్ద భద్రతను పటిష్టం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్నిప్రమాదాలు జరిగిన ప్రతిసారీ దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం వల్లనే అసాంఘిక శక్తులు తెగబడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిఘా కెమెరాలు, పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంలో అధికారులు విఫలమయ్యారనేది స్పష్టమవుతోంది.

అమరావతి రాజధాని పనులు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుని, వరల్డ్ బ్యాంక్ నిధులు మంజూరైన తరుణంలో ఇలాంటి ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఆస్తికి భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, నిర్మాణ గడువుపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని, వాళ్ల కుట్ర కూడా అదేననే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos