మంగళగిరి ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) సీజన్ – 4 క్రికెట్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 27వ రోజుకు చేరుకున్న ఈ పోటీలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ హాజరై క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. మూడో రౌండ్ చివరి మ్యాచ్‌గా వల్లభనేని వెంకట్రావ్ యూత్, విక్కీ 11 జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు మంత్రి లోకేశ్ టాస్ వేశారు. అనంతరం సరదాగా ఆయన కాసేపు క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన ఫొటోలను మంత్రి లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయని, సరదాగా కాసేపు క్రికెట్ ఆడినట్లు లోకేశ్ పేర్కొన్నారు. అనంతరం మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన మగువ వస్త్ర దుకాణాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా.. తన భార్య బ్రాహ్మణికి, తల్లి భువనేశ్వరి దేవికి మంత్రి చీరలు కొనుగోలు చేశారు. ఇదే క్రమంలో.. తన సొంత నిధులతో ఆధునికీకరించిన పీర్ల సావిడిని మంత్రి ప్రారంభించారు. ముస్లిం పెద్దలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అదేవిధంగా... రాష్ట్రంలో అధునాతన రైతు బజార్ త్వరలోనే నిర్మిస్తామని చెప్పిన లోకేష్.. దాదాపు 300 మంది రైతులు నేరుగా తాము పండించిన కూరగాయలను వచ్చి విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు.. మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శ్మశానాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గుంటూరు, విజయవాడతో పోల్చుకుంటే మంగళగిరిలో 25 శాతం ప్రజల పెరిగారని.. దానికి అనుగుణంగా వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos