తిరుపతిః తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలతో అతిపెద్ద కుటుంబంగా మారిన సందర్భంలో కార్యకర్తే అధినేత అని స్పష్టం చేసిన విద్య, ఐటీ శాఖల మంత్రా నారా లోకేష్... తాను అన్న మాటలను ఆచరణలో పెట్టారు. కార్యకర్తే అధినేత అన్న మాటను శిరసావహిస్తూ.. తన తిరుపతి నియోజకవర్గ పర్యటనలో ముందుగా పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇకపై ఏ నియోజకవర్గ పర్యటనకు వెళ్లినా మొదట కార్యకర్తలతో భేటీ కావాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారెంటీ, పార్టీ సభ్యత్వం, ఓటర్ వెరిఫికేషన్, మన టీడీపీ యాప్ లో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలు, నాయకులతో ఎక్కువ సమయం కేటాయించనున్నారు. అందులో భాగంగానే నేడు తిరుపతిలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్.. ముందుగా టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ లతో పాటు బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.

పనిచేసే వారిని ప్రోత్సహిస్తా.. 

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు మా అందరికీ పదేపదే చెప్పేది.. ఏ నియోజకవర్గంలో పర్యటించినా అక్కడి క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ సభ్యులను కలిసి మాట్లాడాలని చెప్పారు. అనంతరం బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ఆదేశించారు. అందులో భాగంగానే పార్టీని బలోపేతం చేసేందుకు నేను సగం రోజు మీతో గడుపుతున్నాను. పార్టీ, ప్రభుత్వం రెండూ అనుసంధానమై ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో నూతనంగా క్లస్టర్, యూనిట్, బూత్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో నేను పాదయాత్ర చేసినప్పుడు.. అన్నా నేను కష్టపడ్డాను.. నన్ను గుర్తించడం లేదని చాలా మంది నాతో చెప్పారు. సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తా, పనిచేసే వారిని ప్రోత్సహిస్తా. పార్టీ లేకపోతే మనం ఎవరూ లేము అని గుర్తుంచుకోవాలి. ఇవాళ మనకు సమాజంలో గౌరవం లభిస్తోందంటే అందుకు కారణ తెలుగు దేశం పార్టీనే. 

కార్యకర్తల సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలబడాలి

ఎన్నికల్లో గెలిచాం, తిరుగులేదనే ధోరణి సరికాదు. నిత్యం ప్రజల్లో ఉండాలి. మంగళగిరిలో నేను 91వేల మెజార్టీతో గెలిచా. నాకు ఎంత పని ఒత్తిడి ఉన్నా మంగళగిరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నా. బాధ్యత పెరిగింది. కార్యకర్తల సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలబడాలి. అలకలు మానుకుని నాయకులు సమిష్టిగా పనిచేయాలి. గత ఐదేళ్లలో మనం అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. అక్రమ కేసులు పెట్టారు, లాఠీఛార్జి చేశారు. అవన్నీ మర్చిపోకూడదు. ఇది మన కుటుంబం. పార్టీలో సంస్కరణల కోసం అహర్నిశలు కష్టపడుతున్నా. పార్టీలో పొలిట్ బ్యూరో ఉంటుంది. అందులో చర్చ జరగాలి. తర్వాత నిర్ణయం తీసుకోవాలి. మంగళగిరిలో లక్ష సభ్యత్వాలు చేయడం జరిగింది. శాశ్వత సభ్యత్వాలు దాదాపు 180 వరకు చేశాం. ఇక్కడ ఆ స్థాయిలో జరగలేదు. పార్టీని బలోపేతం చేసేందుకు అందరం కష్టపడాలి. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు పనిచేశారో తెలుసుకుని వారికే పదవులు ఇస్తాం. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. త్వరలో నూతన విధానం తీసుకువస్తున్నాం. జాతీయ అధ్యక్షుల వారి నుంచి బూత్ ఇంఛార్జ్, బూత్ కమిటీ సభ్యుల వరకు అందరం కుటుంబ సాధికార సారధిలో(కేఎస్ఎస్) నమోదు కావాల్సి ఉంటుంది. పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత పార్టీ పదవి కావాలన్నా, నామినేటెడ్ పోస్టు కావాలన్నా కేఎస్ఎస్ లో ఉండాలి. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా 120 మంది ఓటర్లతో కూడిన కేఎస్ఎస్ ను కలవాలి, వారికి చెప్పాలి. కేఎస్ఎస్ కార్యక్రమం తర్వాత క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ లను నియమిస్తాం. అనంతరం గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు నియమించడం జరుగుతుంది. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీని ఏర్పాటుచేయడం జరుగుతుంది.

వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి

పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కలిసికట్టుగా పనిచేయాలి. ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండాలి. మన లక్ష్యం ఒక్కటే పార్టీ బలోపేతం కావాలి. అందుకు అహర్నిశలు కష్టపడాలి. ఈ రోజు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు. టీడీపీ హయాంలోనే పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచడం జరిగింది. జగన్ రెడ్డికి వెయ్యి పెంచడానికి నాలుగున్నరేళ్లు పట్టింది. నేడు మనం వృద్ధాప్య పెన్షన్ రూ.4వేలు, వికలాంగ పెన్షన్ రూ.6వేలు, పూర్తి వికలాంగులకు రూ.15వేలు పెన్షన్ అందిస్తున్నాం. దేశంలో ఈ స్థాయిలో ఎక్కడా పెన్షన్ అందించడం లేదు. అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేసింది టీడీపీనే. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఏప్రిల్, మే నెల నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలుచేస్తామని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. జగన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైంది? సీపీఎస్ రద్దు చేస్తామన్నారు, ఏమైంది? ఇవన్నీ మనం మాట్లాడాలి. వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. జగన్ రెడ్డి అన్నీ అప్పులు చేసి పోయారు. అయినప్పటికీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం, పెన్షన్ అందిస్తున్నాం, టీఏ, డీఏ బకాయిలు చెల్లిస్తున్నాం. వైసీపీ నేతలు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు ప్రజలను, మనల్ని ఇబ్బంది పెట్టారు. తప్పుచేసిన వారిని పద్ధతి ప్రకారం చట్టపరిధిలో శిక్షిస్తాం అని అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos