భారతదేశంలో ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారమే ప్రధానిని అభినందించిన విషయం తెలిసిందే. ఈ అసాధారణ మైలురాయిపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా మొత్తం 8,931 రోజులు నిరంతరాయంగా ప్రభుత్వ అధినేతగా సేవలు అందించడంపై ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. "ఆయన ప్రస్థానం కేవలం పదవీకాలానికి సంబంధించింది కాదు. ఇది తిరుగులేని సంకల్పం, అలుపెరగని అంకితభావం, భారత సేవకే అంకితమైన జీవితం. అట్టడుగు స్థాయి నాయకత్వం నుంచి ప్రపంచ వేదికపై దేశానికి మార్గనిర్దేశం చేసే వరకు, 'దేశమే ప్రథమం' అనే స్పష్టమైన దార్శనికతతో ఆయన పాలనను పునర్నిర్వచించారు" అని పవన్ కల్యాణ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఆయన నాయకత్వం క్రమశిక్షణ, త్యాగం, అసమానమైన పనితీరుకు నిదర్శనమని, దేశ మౌలిక సదుపాయాల బలోపేతం, పేదల సాధికారత, డిజిటల్ విప్లవం, ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ఠ‌ను పెంచడం వంటి అంశాలు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని కొనియాడారు.

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. "ప్రభుత్వ అధినేతగా 8,931 రోజులు పూర్తి చేసుకుని, ప్రజాసేవలో చారిత్రక మైలురాయిని నెలకొల్పిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ ఘనత ఒక వ్యక్తి సంకల్పానికి, దృఢచిత్తానికి నిదర్శనం. దేశ సేవలో మీకు మరింత శక్తి, ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను" అని జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అంతకుముందే .. నిన్న ఆదివారం రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధానిని అభినందించారు. దేశ పురోగతి, శ్రేయస్సు కోసం ప్రధాని మోదీ అంకితభావం, దార్శనిక నాయకత్వానికి ఈ ఘనత ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. కాగా, సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును ప్రధాని మోదీ అధిగమించి, భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా పనిచేసిన నేతగా నిలిచారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos