‎ఏలూరు : కొయ్యలగూడెం వద్ద తలపెట్టిన నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ఏర్పాటు నిర్ణయం విరమించుకున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. గురువారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. 90శాతం మంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ, కొందరు స్థానిక నేతలు ప్రజల్లో అపోహలు సృష్టించి, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో సమస్య ఏర్పడిందన్నారు. ప్రస్తుతానికి నేవీ డిపో ప్రాజెక్టు ఏర్పాటు పనులు ఆపివేసినట్లు ఎంపీ స్పష్టం చేశారు. 
‎కోకో సిటీ ఏర్పాటుకు భూముల పరిశీలన జరుగుతోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కోకో సిటీ ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పిన ఎంపీ, ఎక్కడ పెట్టేది త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు. ఏలూరు పార్లమెంటులో అభివృద్ధి జరగాలని కోరుకుంటూ పరిశ్రమలు తీసుకువచ్చేందుకు తాను ప్రయత్నిస్తుంటే కొంతమంది అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. ఏదేమైనా అభివృద్ధి పనులు ఆగకుండా చూస్తామన్నారు.  ఆయిల్ పామ్ పంటకు మంచి భవిష్యత్తు ఉందని, జిల్లాలో పొగాకు సాగు చేస్తున్న  రైతులు కూడా కొంతమేర పొగాకు పంటను తగ్గించుకొని, పామాయిల్ పంట వైపు మళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది ఆయిల్ పామ్ గెలలకు గతంలో ఎన్నడూ లేనంత మంచి ధర లభిస్తోందన్న ఎంపీ, భవిష్యత్తులో మరింత ధరలు పెరుగుతాయని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 56 స్మశాన వాటికలకు నిధులు కేటాయించామని, అనేక చోట్ల నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు. నూజివీడు ప్రాంతంలో ఇటీవలే కొన్ని పరిశ్రమలు వచ్చాయని, మరికొన్ని పరిశ్రమలు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఏంటి వెల్లడించారు. పరిశ్రమల స్థాపనకు జిల్లాలో భూముల కొరత అడ్డంకిగా మారిందన్నారు.  ఏలూరులో పబ్లిక్ లైబ్రరీ పునర్మాణ పనులు కూడా ఈ సంవత్సరంలోనే మొదలు పెడతామని అన్నారు.  జిల్లాలో బీసీ హాస్టల్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు.  ద్వారకాతిరుమల్లో ఒక కళ్యాణమండపం నిర్మాణానికి నాయి బ్రాహ్మణుల సంఘం తరపున కోరగా, నిబంధనలు సవరించి  అనుమతులు మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామని, త్వరలోనే అనుమతులు వస్తాయని ఆశిస్తున్నానన్నారు. ఏలూరు పార్లమెంటులో ప్రతి పల్లెకి రోడ్డు సౌకర్యం ఉండాలనేది తన లక్ష్యం అన్న ఎంపీ, ఇప్పటికే అనేక గ్రామాల్లో రోడ్లు నిర్మించామని, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మరికొన్ని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos