ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో సమావేశం జరుగుతోంది. రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతిక వినియోగంపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. మూడు నెలలకూ రి కలెక్టర్ల కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నామని, ప్రతినెలా రెండుసార్లు కేబినెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. జగన్ ఇంటి దగ్గర ఉన్న హెలిప్యాడ్ భూమి పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ ఇంటి పక్కన ఉన్న హెలిప్యాడ్ కోసం భూమిని బలవంతంగా లాక్కున్నారని.. ప్రైవేటు వ్యక్తి కొనుక్కున్న భూమిని ..  హెలిప్యాడ్ కోసం ఇవ్వనంటే.. బెదిరించారని చెప్పుకొచ్చారు. అయినా ఇవ్వకపోతే.. 22-A లో పెట్టారని చెప్పారు.  చట్టాలను అమలు చేయాల్సిన వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి భూమిని ఇల్లీగల్ గా 22-A లో పెట్టారని వ్యాఖ్యానించారు.

రెవెన్యూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 204 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి అన్నార్తుల ఆకలి తీరుస్తున్నామని వివరించారు. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా డ్రైవర్లకు మేలు చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.1100 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పంటలను ఆదుకుంటున్నామని.. ధాన్యం కొనుగోళ్లకు కూడా రూ.10 వేల కోట్ల మేర 48 గంటల్లోనే చెల్లింపులు చేశామని చెప్పారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్రవ్యాప్తంగా ఇస్తున్నట్లు వివరించారు. సాగునీటి కోసం ఇప్పటి వరకూ రూ. 24 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.

క్వాంటం వ్యాలీకి ఇటీవలే శంకుస్థాపన చేశామని,  అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా మారుస్తున్నామని వివరించారు. విశాఖలో గూగుల్ తో పాటు ఇతర సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. విద్యుత్ రంగంలో ట్రూ అప్ నుంచి ట్రూడౌన్ చేసే పరిస్థితికి వచ్చామన్నారు.రూ. 1000 కోట్లతో రోడ్ల మరమ్మత్తు చేశాం, మరో రూ. 3 వేల కోట్లు ఖర్చు చేసి రోడ్లను నిర్మిస్తున్నామని వివరించారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నామని ప్రకటించారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos