ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమలకు వెళ్లనున్నారు. ఏటా లోకేశ్‌ కుమారుడు దేవాన్ష్‌ జన్మదినం రోజున వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చును టీటీడీకి విరాళంగా అందజేసి భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. దేవాన్ష్ జన్మదినం నాడు సీఎం చంద్రబాబు ప్రతీ ఏటా తిరుమలలోనే ఉంటున్నారు. ఆ రోజున ప్రత్యేకంగా అన్న ప్రసాద వితరణలో స్వయంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు పొల్గొంటారు. ఇందుకోసం నిత్యం వేలాది మందికి అన్నదానం చేసే వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రంలో ఒక రోజు మొత్తానికి అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు చంద్రబాబు టీటీడీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 'ఒక్కరోజు అన్నప్రసాదం స్కీం'కు రూ.44 లక్షల విరాళాన్ని టీటీడీకి అందజేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేశ్‌ దంపతులు, దేవాన్ష్‌ శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకొని రాత్రికి బస చేసి 21తేదీన దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత అన్నప్రసాద భవనానికి చేరుకుని అన్నప్రసాద వితరణ చేయనున్నారు.

గత కొన్నేళ్లుగా ప్రతీ ఏటా దేవాన్ష్ జన్మదినం వేళ చంద్రబాబు కుటుంబం తిరుమల లో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణకు విరాళం ఇవ్వటం ఆనవాయితీగా మార్చుకున్నారు. గతంలో రోజూ రూ.30 లక్షలు విరాళంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం రూ 44 లక్షలకు పెంచుతూ నిర్ణయించారు. దీంతో.. ఈ మొత్తాన్ని చంద్రబాబు కుటుంబం టీటీడీకి అందించనుంది. కాగా.. అదే సమయంలో ఆ రోజు మొత్తం వెంగమాంబ అన్నప్రసాదం జరిగే హాల్ లో బోర్డు పైన ఆ రోజు అన్నదానానికి విరాళం ఇచ్చిన వారి పేరు డిస్ ప్లే చేస్తారు. దీంతో.. ఈ సారి వెంగమాంబ నిత్య ప్రసాద భవనంలో.. టుడే డోనర్‌ మాస్టర్‌ నారా దేవాన్ష్‌ అనే పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos