మంగళగిరి: తెలుగుదేశం పార్టీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ కు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోని తన చాంబర్ లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రి నారా లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యనిర్వాహక అధ్యక్షులుగా నారా లోకేష్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. అంతకుముందు ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ సమక్షంలో కేక్ కట్ చేశారు. శ్రీకృష్ణదేవరాయలకు కేక్ తినిపించి మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos