ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా గైర్హాజరవుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు సభకు రాకుండానే సంతకం చేసి జీతం తీసుకుంటున్నట్లు గుర్తించారు. తాజాగా అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ వీరి విషయంలో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అదే విధంగా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాకపోవటం పైన గతంలోనూ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు స్పీకర్ ఇదే అంశం పైన స్పందిస్తూ సంచలన ప్రతిపాదన చేసారు.

లక్నోలో జరుగుతున్న అఖిల భారత సభాపతుల సమావేశంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు'నో వర్క్.. నో పే' అనే విధానం చట్టసభల్లోనూ రావాలని సూచించారు. దానికి అనుగుణంగా చట్టం చేయాలని.. దానికి సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలనీ ఆయన ప్రతిపాదించారు. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే.. సంబంధిత అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సహా వారి వేతనాలు నిలిపి వేస్తున్నారని స్పీకర్ గుర్తు చేసారు. అయితే, తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు సభకు రానప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అయ్యన్న చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల తర్వాత అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రానివారు ఉన్నారని.. కనీసం సభలో జరిగే ప్రశ్నోత్తరాలు, చర్చల్లోనూ పాల్గొనడం లేదని ఏపీ స్పీకర్ పేర్కొన్నారు.

ఈ వైఖరి కారణంగా తమను ఎన్నుకున్న ప్రజలకు ఎమ్మెల్యేలు అన్యాయం చేస్తున్నారని స్పీకర్ పేర్కొన్నారు. సభకు హాజరు కాకపోవడం వల్ల ప్రజల దృష్టిలో సభ్యులు చులకనవుతున్నారని చెప్పుకొచ్చారు. సభకు హాజరు కాకుండానే వారు వేతనాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారంగా నో వర్క్.. నోపే విధానం పై చట్టం చేయాలని కోరారు. సభకు రానివారిని రీకాల్ చేసే హక్కు ప్రజలకు కల్పించేలా చట్టం చేయాలని ఏపీ స్పీకర్ ప్రతిపాదించారు. ఇటు వైసీపీ ఎమ్మెల్యేల్లో జగన్ మాత్రమే జీతం తీసుకోవటం లేదని.. కొందరు ఎమ్మెల్యేలు సభకు హాజరవుతున్నట్లు సంతకాలు చేసి.. సమావేశాలకు దూరంగా ఉంటున్నారని తాజాగా ఎథిక్స్ కమిటీలో చర్చ జరిగింది. ఆరుగురు ఎమ్మెల్యేలు ఇలా తీసుకున్నట్లు ప్రాధమికంగా గుర్తించారు. వీరి వివరాలు పూర్తి స్థాయిలో సేకరించిన తరువాత సభలో చర్చించి.. ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్లాలో డిసైడ్ చేయాలని నిర్ణయించారు. కాగా, ఇప్పుడు అయ్యన్న చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos