డెస్క్ : ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ వేడుకలు బహరైన్ లొ NRI తెలుగు దేశం మరియు NBK సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 500 పైగా అభిమానుల సమక్షంలో అత్యద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్బ్యూరో సభ్యులు టి.డి.జనార్ధన్ మాట్లాడుతూ.. మన అన్నగారి శతజయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని ప్రతి దేశంలో జరుపుకుంటున్నాం. జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కథా నాయకుడు, మహా నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు అని కీర్తించారు. రాజకీయ, సినీ రంగాల్లో చెరగని ముద్ర వేశారు అన్నగారు. మనకు రాముడు, కృష్ణుడు తెలుసు, అలాగే రావణ శకం తెలుసు, శాలివాహన రాజులు తెలుసు. ఆ తర్వాత తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకునేది, గుండెల్లో పెట్టుకునేది ఎన్టీఆర్ నే. ఆయన తన సినిమాల ద్వారా మంచి సందేశాన్ని సమాజానికి అందించారు. ఎన్టీఆర్ గారు సినిమాల్లో నటించేవారు అనేకన్నా జీవించారు అని చెప్పడం కరెక్ట్. రాజకీయాల్లో ఆయన ఏం చెప్పారో అదే చేశారు. ప్రజా నాయకుడిగా మనసులు గెల్చుకున్నారని అన్నారు
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించిన బహ్రెయిన్ తెలుగు దేశం సభ్యులకు కృతజ్ఞతలు. సినీరంగంలో ఎన్టీఆర్ ఖ్యాతిని మరో నటుడు అందుకోలేరు. ఆయన తను నటించే పాత్రల్లో జీవించేవారు. ఆ క్యారెక్టర్స్ ను అర్థం చేసుకునేవారు. ఒక్కో సినిమాలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి కూడా ప్రేక్షకుల్ని మెప్పించారు. మరో నటుడికి సాధ్యం కాని ఎన్నో ఘనతలు ఎన్టీఆర్ వెండితెరపై సుసాధ్యం చేశారు. కుటుంబంలో శుభకార్యాల కంటే ప్రజల క్షేమమే ముఖ్యం అని ఎప్పుడు చేప్పేవారని తెలియ చేశారు. తన అన్న బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అని కళా రంగంలోనే కాకుండా సేవా రంగం, రాజకీయ, వైద్య రంగాల్లో కూడా అనేక గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారని తెలియ చేశారు.
ప్రముఖ నటి ప్రభ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హీరోయిన్ ను అయినంత మాత్రాన నాపై ఇంత ప్రేమ, గౌరవం చూపిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు అందరికీ కృతజ్ఞతలు. టి.డి.జనార్ధన్ గారు నన్ను గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమానికి పిలిచారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ఎన్టీఆర్ గారి జీవితంలోని ఎన్నో విశేషాలతో తారకరామం అనే పుస్తకం రాయడం అభినందనీయం. ఎన్టీఆర్ గారు నటుడిగా ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద పాత్రలతో ప్రేక్షకుల్లో మనసుల్లో చిరస్మరణీయులు అయ్యారు. ఆయన రాముడిగా, కృష్ణుడిగా, రావణాసురుడిగా, దుర్యోధనుడిగా..ఇలా ఎన్నెన్నో పౌరాణిక పాత్రలతో గుర్తుండిపోయారు. ఎన్టీఆర్ పిల్లలు కూడా ఆయన వారసత్వాన్ని ఘనంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. పురంధేశ్వరి గారు ఢిల్లీ రాజకీయాల్లో గొప్ప స్థాయిలో ఉండటం మనందరికీ గర్వకారణం అని అన్నారు.
స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ కే పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎటువంటి మచ్చ లేని, నిజాయితీ తో కూడిన రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ఈకో వారియర్స్ ఆధ్వర్యంలో 65 వారాల గా స్వచ్ఛ భారత్ స్ఫూర్తి తో ప్రతి శుక్రవారం బీచ్ లలో ప్లాస్టిక్ నిర్మూలన కోసం చేస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆర్య వైశ్య కమిటి చైర్మన్ డూండి రాకేష్ గారు మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదల తో పని చేసే నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు అని, ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో యువత ఉపాధి పెరుగుతుంది అని కొనియాడారు. బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కు శ్రీ పొట్టి శ్రీరాములు గారు కారణం ఐతే తెలుగు వారి ఉనికిని చాటి చెప్పిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos