ప్రపంచ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ యువత కీలక పాత్ర పోషిస్తోందని, ప్రతి నలుగురు భారతీయ ఐటీ నిపుణుల్లో ఒకరు మన రాష్ట్రానికి చెందినవారే ఉండటం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సును ఆయన ప్రారంభించి, 'డిజిటల్ ఏపీ' ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు 30 శాతం మంది ఏపీ వారే. గట్టి సంకల్పంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనడానికి ఇదే నిదర్శనమని" తెలిపారు. గతంలో తాను నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, తెలంగాణ తలసరి ఆదాయంలో అగ్రస్థానానికి చేరిందని గుర్తుచేశారు. భవిష్యత్ ప్రణాళికల గురించి వివరిస్తూ, అమరావతిలో అత్యాధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. "ప్రముఖ సంస్థలైన ఐబీఎం, టీసీఎస్‌ సహకారంతో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని" ఆయన వెల్లడించారు. సాంకేతికతకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాల్సిన అవసరం ఉందని, నేడు ప్రజలకు అవసరమైన అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. "ప్రజలకు మేలు చేసే ఎన్నో కొత్త సంస్కరణలను మోదీ తీసుకొచ్చారు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడిగా ఆయన నిలిచారని"  కొనియాడారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos