నేడు ఏపీ రాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము   మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవ వేడకకు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి  చేతుల మీదుగా 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీలు, పోస్ట్‌ డాక్టోరల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పూర్తి చేసిన నలుగురు విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్‌ రావ్‌ గణపత్‌రావ్‌ జాదవ్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌ యాదవ్, నారా లోకేశ్‌ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఇక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న వారిలో ఇప్పటి వరకు ఏపీ విద్యార్థులే అధికంగా ఉన్నారు. 2018-24 మధ్య ఎంబీబీఎస్‌ విద్యార్థులు 725 మంది చేరగా వారిలో సుమారు సగంమంది  విద్యార్థులే ఉన్నారు. 

కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు భారీ వాహనాలన్నీ ఇతర మార్గాల్లో వెళ్లాల్సి ఉంది. చెన్నై నుంచి వైజాగ్‌ వైపు వెళ్లే వాహనాలను గుంటూరు బుడంపాడు మీదుగా అవనిగడ్డ - పామర్రు - గుడివాడ - హనుమాన్‌ జంక్షన్‌ వైపుకు మళ్లించారు. వైజాగ్‌ నుంచి ఏలూరు, విజయవాడ, చెన్నై వెళ్లే వెహికిల్స్‌ హనుమాన్‌ జంక్షన్‌- గుడివాడ, పామర్రు, అవనిగడ్డ మీదుగా మళ్లించారు. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మీదుగా వెళ్లాలని జిల్లా పోలీసులు సూచించారు. వాహనదారులు ఈ హెచ్చరికలను గమనించి సహకరించాలని వారు కోరుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos