ఏపీలో నెయ్యి వివాదం మరింత ముదురుతోంది. శాసన మండలిలో హెరిటేజ్‌, ఇందాపూర్‌ సంస్థ అంశాలపై చర్చించాలని వైసీపీ పట్టుబడుతోంది. అందులో భాగంగా రోజూ వాయిదా తీర్మానాలు ఇస్తూ వస్తోంది. ఎప్పటి మాదిరిగానే మండలి ఛైర్మన్ వాటిని తిరస్కరిస్తున్నారు. శుక్రవారం కూడా వైసీపీ సభ్యులు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి, హెరిటేజ్, ఇందాపూర్ వ్యవహారంపై చర్చించాలని వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వాటిని ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ నేతలు తమ వెంట తెచ్చుకున్న వెంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిపెట్టిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. 

వైసీపీ సభ్యులు దేవుడి ఫొటోలను మండలిలోకి తీసుకురావడంపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని ప్రశ్నించింది. దేశ చరిత్రలోనే ఇలాంటివి ఎక్కడా జరగలేదని చెప్పింది. చట్టసభల్లో దేవుడి చిత్రాలు, మతపరమైన థింగ్స్‌ తీసుకురాకూడదనే రూల్‌ను అతిక్రమించారని ఆరోపించారు. మంత్రి పయ్యావుల కేశవ‌ మాట్లాడుతూ దేవుడిపై నమ్మకం లేని వారు దేవుడి ఫొటోలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి చర్యలను చైర్మన్ ఖండించాలని డిమాండ్ చేశారు. మండలి ఛైర్మన్ కూడా వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి సభలో ప్రదర్శించ కూడదని వారించారు. అయినా వైసీపీ సభ్యులు ఆయన సూచనలు పట్టించుకోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీటీడీలో హెరిటేజ్ అక్రమాలకు ప్రభుత్వం వంతపాడుతోందని నిరసన తెలిపారు. ఆ అంశాల్లో చర్చ జరిపితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు. 

ఓవైపు ఛైర్మన్, మరోవైపు అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం చెప్పినా వైసీపీ నేతలు వినిపించుకోలేదు. వారు మండలి ఛైర్మన్‌ పోడియంను చుట్టు ముట్టి నినాదాలు చేశారు. వారికి వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులు వ్యతిరేకంగా నినాదాలు అందుకున్నారు. ఎవరూ తమ సీట్లలో కూర్చోకుండా మండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సభను వాయిదా వేస్తున్నట్టు మండలి ఛైర్మన్ ప్రకటించారు. అప్పటి వరకు వైసీపీ సభ్యులపై ఆగ్రహంతో మాట్లాడుతున్న మంత్రి పయ్యావుల కేశవ్‌ తన చేతిలో ఉన్న మైక్‌ను విసిరికొట్టారు. 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos