ఎండలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో వింత పరిస్థితి నెలకొంది. బంగాళాఖాతం గగనతలంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు పలు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. ఏపీలో ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ పలు జిల్లాల్లో చెదురుమదురు నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉందని సూచించింది. పశ్చిమ- మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకొని ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది చురుకుగా కదులుతోంది. ఇది మరింత విస్తరించడానికి అనుకూల వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్ గఢ్, తెలంగాణ ఉత్తర ప్రాంతం మీదుగా ఇది విస్తరిస్తోంది. ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో నేటి నుండి వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ​కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మరిన్ని వర్షాలు కురవడానికి వాతావరణం అనుకూలంగా ఉందని పేర్కొంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలు లేకపోలేదు. అలాగే రాయలసీమ రీజియన్ లోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీస్తాయని,. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కార్మికులు చెట్ల కింద ఆశ్రయం తీసుకోకూడదని సూచించింది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos