అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఇవాళ గురువారం చెవిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేసింది. భాస్కర్‌రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్‌ నాయుడులకు కూడా హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. కాగా, ఏపీలో రూ. వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని.. అందులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాత్ర కూడా ఉందంటూ 2025 జూన్‌17న ఆయన్ను సిట్‌ బెంగుళూరులో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. చివరికి 226 రోజుల తర్వాత ఆయనకు బెయిల్‌ ద్వారా ఊరట లభించింది.

ఇదే కేసులో  విజయవాడ జిల్లా జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఫిజియోథెరపి చేయించుకునేందుకు ఇటీవల ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాను వెన్ను నొప్పితో బాధపడుతున్నానని.. ఉండవల్లిలో ఉన్న మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి చికిత్సాలయంలో వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. అనంతరం 15 రోజులపాటు వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా ఈ కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అనిల్‌ చోఖ్రాకు తాగడానికి వేడినీళ్లను సమకూర్చాలని ఏసీబీ కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం డిస్టిలరీలను తమ అదుపులో ఉంచుకుని, సొంత మద్యం బ్రాండ్లు తయారు చేయించారని.. బ్రూవరేజస్‌ ద్వారా అమ్మించి భారీగా లాభాలు ఆర్జించి.. ఇతర సంస్థల్లోకి మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన అభియోగం. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వైకాపా ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిని ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. దాదాపు 7 గంటలు పాటు జరిగిన విచారణలో అక్రమ మద్యం వ్యవహారంలో ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్ దర్యాప్తులోనూ వెల్లడైన వివారాలను పక్కన పెట్టుకొని ఈడీ మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. అంతకుముందు జరిగిన విచారణలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పిన విషయాలను ఈడీ అధికారులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos