ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచడమే కాకుండా, రాజధాని గ్రామాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ రాజధాని గ్రామమైన వడ్డమానులో ఇవాళ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని మంత్రి నారాయణ ప్రారంభించారు. రైతుల విన్నపాన్ని మన్నించి, కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. సుమారు రూ.98.7 లక్షల రూపాయల వ్యయంతో 1,148 మీటర్ల పొడవున్న ఈ రహదారిని యుద్ధప్రాతిపదికన నిర్మించినట్లు వెల్లడించారు. అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిలిపేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధిలో భాగస్వాములైన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో వచ్చే ఏడాది జనవరి నుంచి మౌలిక వసతుల కల్పన పనులను భారీ ఎత్తున చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో ఆధునిక రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వరద  కాలువలు, వీధి లైట్ల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాజధాని ప్రాజెక్టులో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, రైల్వే ట్రాక్ వంటి మౌలిక సదుపాయాల కోసం భూములను సేకరించాల్సి ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 

ఈ భూముల సేకరణకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్  పద్ధతికే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చేలా ప్రోత్సహిస్తామని, ఒకవేళ ఎవరైనా ల్యాండ్ పూలింగ్ కు ముందుకు రాకపోతే మాత్రమే ప్రత్యామ్నాయంగా భూసేకరణ చట్టంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వివరించారు. గ్రామస్తుల కోరిక మేరకు త్వరితగతిన రోడ్డు నిర్మించినట్లే, రాజధాని అభివృద్ధిని కూడా అంతే వేగంగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos