ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు భారీగా కేటాయింపులు చేసింది.  రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. అన్నదాత సుఖీభవ కోసం రూ.6300 కోట్లు, తల్లికి వందనం పథకం కోసం రూ.9407 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై మండలిలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్, మే మాసాల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని కౌన్సిల్ సాక్షిగా చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ క్రమంలోనే విద్యా, వ్యవసాయ శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ప్రతి బిడ్డకు రూ.15 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. 

మంత్రి పయ్యావుల కేశవ్ ఇంకా మాట్లాడుతూ..  సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంలు అందిస్తామన్నారు. డొక్కాసీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్ధులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంతో కూడిన విద్యా వ్యవస్థ కోసం మంత్రి నారా లోకేష్ చొరవతో తమ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు కేటాయింపుల్ని ప్రతిపాదించారు.

భవిష్యత్ సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేయడం, అందరికీ సమాన అవకాశాలను కల్చించడం కోసం బలమైన, సమ్మిళిత ఉన్నత విద్యావ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉందన్నారు పయ్యావుల కేశవ్. అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్‌ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos