ఏపీని వైద్య ఆరోగ్య రంగంలో మేటిగా నిలిపేందుకు వీలుగా ప్రభుత్వం (ap govt) ఇవాళ కీలక నిర్ణయాలు తీసుుకుంది. ఈ మేరకు సంజీవని ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అలాగే ప్రతీ నెల 4వ శనివారం 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్ మెంట్'  పేరుతో గ్రామసభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా, కుప్పం, నారావారిపల్లెలో సక్సెస్ అయిన సంజీవని ప్రాజెక్టును జూలై కల్లా రాష్ట్రమంతటా అమలు చేయాలని ఆదేశించారు.

వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలనే లక్ష్యాన్ని చంద్రబాబు నిర్దేశించారు. వైద్య పరీక్షల ఫలితాలను వాట్సప్ ద్వారా నేరుగా 48 గంటల్లో వారికి అందించాలన్నారు. ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూనిట్లు, రూ.162 కోట్లు వ్యయం చేసేందుకు సీఎం అంగీకరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.14 లక్షల మంది సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ డేటాబేస్‌లో నమోదు చేసుకున్నారని, వ్యక్తిగత హెల్త్ రికార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్‌లో వైద్య ఖర్చులు తగ్గేలా చూడాలని, ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి పెట్టాలన్నారు. యోగా, న్యూట్రిషన్, మెడిటేషన్, ప్రాణాయామం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని... ఈ 5 పిల్లర్లతో త్వరలో 'ఏపీ హెల్త్ మేనేజ్ మెంట్ పాలసీ' తీసుకురావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. త్వరలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుపైనా సీఎం సమీక్షించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగస్వామి అయ్యేందుకు ఇన్సూరెన్స్ సంస్థలు ముందుకొస్తున్నట్టు అధికారులు తెలిపారు. పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం చర్చించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడా ఖాళీలు ఉండకూడదని, రేషనలైజేషన్ ద్వారా ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలన్నారు. వైద్యుల సూచన మేరకు మాత్రమే గర్భిణులకు ఇకపై సిజేరియన్లు చేయాలని, మిగిలిన సమయంలో నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 20 శాతానికి మించి సిజేరియన్లు జరిగితే ఆడిటింగ్ చేయాలన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos