ఏపీ రాజధాని అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఊపందుకుంటోంది. ఈరోజు పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు మండలం కర్లపూడి - లేమల్లె గ్రామాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ ఈ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి నారాయణ రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు. తమ వద్దకు వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేలకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో స్వాగతించారు. తమ గ్రామాలను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి రైతులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండో దశలో మొత్తం 7 గ్రామాల్లో భూసమీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పల్నాడు జిల్లా అమరావతి మండలంలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె... గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాలు ఉన్నాయి.


ఇప్పటివరకు కర్లపూడి - లేమల్లెతో సహా 4 గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ భూములను అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం (ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ), స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి పెద్ద ప్రాజెక్టుల కోసం ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. మొదటి దశలో 34,000 ఎకరాలు ఇప్పటికే పూల్ అయ్యాయి, ఇప్పుడు ఇంకా విస్తరణతో అమరావతి మరింత పెద్ద నగరంగా మారనుంది. పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని 7 గ్రామాల్లో ప్రభుత్వం 20,494 ఎకరాల భూమిని సేకరించనుంది. రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణాల కోసం ఈ భూ సమీకరణ జరుగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

14-55-06-0506.jpg

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్..! జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి లోకేష్
2026-05-11 Time: 02:55:06

12-21-39-0539.jpg

ఏపీకి మరో దిగ్గజ సంస్థ.. శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
2026-05-06 Time: 12:21:39

16-17-06-0506.jpg

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు..!రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం చంద్రబాబు
2026-05-05 Time: 04:17:06

12-32-49-0449.jpg

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్.. ఆర్టీజీ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం
2026-04-30 Time: 12:32:49

10-50-59-0459.jpg

మీ త్యాగాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను.. టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార ముగింపు సభలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ 
2026-04-30 Time: 10:50:59

Related Videos