నెల్లూరు : 1వ తేదీనే ఇంటికి పింఛను వస్తుండటంతో పేదల కళ్లలో సంతోషం చూస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరు మండలంలోని గుమళ్లదిబ్బ గ్రామంలో ఆమె పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛను అందించారు. ఉదయం 6 గంటల నుంచే పింఛను పంపిణీ జరుగుతుండగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారు.. టీడీపీ నాయకులతో కలిసి స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అవ్వాతాతల్ని ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్లను అందించారు. వృద్ధులకు, వితంతువులకు రూ. 4వేల ఫించను, దివ్యాంగులకు 6 వేల నగదును అందజేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అని ఆమె అన్నారు. తాను పెత్తనం చేసే నాయకురాలిని కాదని, సేవకురాలినని అన్నారు. ప్రజలతో మమేకమైతేనే వారి సమస్యలు తెలుస్తాయన్నారు. క్షేత్ర స్థాయిలో తిరిగి తెలుసుకుంటేనే ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయగలుగుతామన్నారు.
అనంతరం గుమళ్లదిబ్బలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూలుకు వెళ్లి బడిలో వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం బాగా లేదని విద్యార్థులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి దృష్టికి తెచ్చారు. భోజనం నాణ్యత విషయంలో తగిన ప్రమాణాలు పాటించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos