టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ సీనియర్ నేత సుబ్బారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తిరుమల శ్రీవారికి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణల కేసులో భాగంగా, ఆయన నివాసంలో దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి స్పష్టం చేశారు. విచారణ ముగిసిన తర్వాత నిన్న రాత్రి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించానని తెలిపారు. కల్తీ నెయ్యి విషయంలో నిజానిజాలు తేలాలనే ఉద్దేశంతో తానే సుప్రీం కోర్టును ఆశ్రయించానని గుర్తుచేశారు. "నాపై అవినీతి ప్రచారం చేయడం దారుణం. కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఉండగా, నెయ్యిలో అవినీతి ఎందుకు చేస్తానని" ఆయన ప్రశ్నించారు. 2024 జూన్‌లో సరఫరా అయిన నాలుగు నెయ్యి ట్యాంకుల్లో జంతువుల కొవ్వు ఉందా? లేక ఇతర నూనెలు కలిపారా? అన్నది తేల్చాలని కోర్టు ఆదేశించిందని వివరించారు. భక్తుల విశ్వాసంతో తానెప్పుడూ ఆడుకోలేదని, బాధ్యతాయుతంగా పనిచేశానని స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రచారంలో ఉన్న అప్పన్న అనే వ్యక్తి 2018 నుంచే తన వద్ద పీఏగా పనిచేయడం లేదని సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. ఒకవేళ నెయ్యి సరఫరాదారుల నుంచి అతని ఖాతాలోకి లావాదేవీలు జరిగి ఉంటే, అతనితో పాటు సహకరించిన అధికారులపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే, 2014 నుంచి జరిగిన నెయ్యి సరఫరాలన్నింటిపైనా విచారణ జరపాలని సిట్‌ను కోరినట్లు వెల్లడించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos