అమరావతి : రాష్ట్ర రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటి నిపుణులు రాజధాని ప్రాంతాలను పరిచిలించారు. 2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా...మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి..అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలని దానిపై ఐఐటి ఇంజినీర్లతో అధ్యయనం చేయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన వాటి స్థితిగతులను అధ్యయనం ఆయా నిర్మాణాల పటిష్టత,ఇతర టెక్నికల్ అంశాలను ఐఐటి ఇంజినీర్లు పరిశీలించనున్నారు. సెక్రటేరియట్,హెచ్ వోడి కార్యాలయాల టవర్లతో పాటు హై కోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా నాటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. దీనికోసం భారీ ఫౌండేషన్ లతో పునాదులు కూడా వేసింది..అయితే పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ భవనల ఫౌండేషన్ సామద్యాన్ని పరిశీలించే బాధ్యతను ఐఐటీ మద్రాస్ కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది..ఇక ఐఏఎస్ అధికారుల నివాసాలు,మంత్రులు,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది ప్రభుత్వం. ఐఐటీ మద్రాస్,ఐఐటీ హైదరాబాద్ ల నుంచి ఇద్దరేసి ఇంజినీర్ల బృందాలు రెండు రోజులపాటు అమరావతిలో పర్యటించి ఆయా కట్టడాల ను పరిశీలించి వాటి నాణ్యత,సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి..అమరావతి పర్యటన లో భాగంగా సీఆర్డీయే అధికారులతో రెండు బృందాల్లోని ఇంజినీర్లు విడివిడిగా సమావేశం కానున్నారు.

అయితే రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు పరిశీలించిన ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం. నిర్మాణాల పరిశీలన అనంతరం మీడియాతో ఐఐటీ ప్రొఫెసర్ లు సుబ్రహ్మణ్యం, మున్వర్ భాషా మాట్లాడుతూ.. భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్దారణకు మరికొంత సమయం పడుతుందన్నారు. భవనాల ప్రస్తుత స్థితి, నిలిచి ఉన్న వర్షపు నీటి ప్రభావం, నిర్మాణ సామగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని, సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం అన్నారు. ప్రతీ అంశాన్ని కూలంకుషంగా పరిశీలన చేసి తదుపరి నివేదిక ఇస్తాం. నిర్మితమైన భవనాల వద్ద టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సామాగ్రి నీ కూడా పరీక్ష చేయాల్సి ఉంది. నివేదిక కు ఎంత కాలం పడుతుందన్నది ఇప్పుడే స్పష్టం గా చెప్పలేం. సాధ్యమైనంత త్వరగానే సీఆర్డీఏ కు, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని నిపుణుల బృందం స్పష్టం చేసారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos